ఏడో శతాబ్దం నాటి కథతో గోపీచంద్ 33!
మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా `ఘాజీ`, `అంతరిక్షం` లాంటి వైవిథ్యమైన చిత్రాలు తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 26 Nov 2025 12:01 PM ISTమ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా `ఘాజీ`, `అంతరిక్షం` లాంటి వైవిథ్యమైన చిత్రాలు తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే? ఓ వైబ్ మొదలైంది. గోపీచంద్ మరో ప్రయోగం చేయబోతున్నాడు? అన్నది స్పష్టమైంది. గోపీచంద్ 33వ సినిమాతో కొత్తగా ఏం చెప్పబోతున్నాడు? అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే చారీత్రాత్మక నేపథ్యం గల కథ అని పోస్టర్స్, గ్లింప్స్ తో క్లారిటీ వచ్చేసింది. కానీ కథ పూర్వ పరాలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా ఆ లీక్ కూడా అందేసింది. ఇది ఏడో శతాబ్దం కాలం నాటి కథ. ఓ యోధుడి పాత్రలో గోపీచంద్ కనిపించనున్నాడు.
భారీ బడ్జెట్ తో సెట్లు:
ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అందుకోసం మొత్తంగా 55 రోజుల పాటు, పని చేసింది టీమ్.
గోపిచంద్‌తో పాటు ప్రధాన తారాగణంపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా పూర్తి చేసారు. సినిమాకు ఈ యాక్షన్ ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ నుంచి లీకులందాయి. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని టీమ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో కొన్ని ఎకరాల స్థలంలో భారీ సెట్లు వేసారు.
ఐదు కోట్ల ఖర్చుతో కూడిన సీన్స్:
ఈ సెట్ నిర్మాణం కోసం అయిదు కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ లో భాగంగా వాటిని నిర్మించినట్లు తెలుస్తోంది. పీరియాడిక్ కథ కావడంతో? బడ్జెట్ భారీ గానే ఖర్చు అవుతుంది. అయినా నిర్మాతలు ఎక్కడా రాజీ పడటం లేదు. ప్రేక్షకులకు ది బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం ఎంతో క్వాలిటీగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే గోపిచంద్ బర్త్‌డే సందర్భంగా విడుదలై స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. యోధుడిలా కనిపించిన గోపిచంద్ తన పాత్రలోని ఇంటెన్స్ ని ప్రజెంట్ చేశారు.
తొలిసారి యోధుడి పాత్రలో:
ఈ జానర్ ని టచ్ చేయడం సంకల్ప్ కు ఇదే తొలిసారి. `ఘాజీ`, `అంతరిక్షం` సినిమాలు పూర్తిగా సాంకేతిక ఆధారంగా తెరకెక్కించారు. వాస్తవ సంఘటనలు ఆధారంగా రూపొందించిన చిత్రాలవి. అలాంటి సంకల్ప్ ఆజానర్ వదిలేసి ఏకంగా చరిత్ర మూలాల్లోకి వెళ్లే సరికొత్త కథను చెప్పబోతున్నాడు. దీంతో విజువల్ గా ఎలా హైలైట్ చేస్తాడు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంత వరకూ యోధుడి పాత్రలను గోపీచంద్ కూడా పోషించలేదు. ఆ రకంగా మ్యాచో స్టార్ కి కూడా కొత్త అనుభవమనే చెప్పాలి. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
