నెగిటివిటీ తగ్గించి కాన్సెప్ట్ సినిమాలు బ్రతికిద్దాం..!
సంతాన ప్రాప్తిరస్తు సినిమాను ఆశీర్వదించిన ప్రేక్షకులకు తన మాటల్లో కృతజ్ఞతలు చెప్పాడు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి.
By: Ramesh Boddu | 18 Nov 2025 1:38 PM ISTవిక్రాంత్, చాందిని చౌదరి లీడ్ రోల్ లో సంజీవ్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు మేకర్స్. సంతాన ప్రాప్తిరస్తు సినిమాను ఆశీర్వదించిన ప్రేక్షకులకు తన మాటల్లో కృతజ్ఞతలు చెప్పాడు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి.
సినిమా గురించి చెబుతూ మా కష్టం సినిమా రూపంలో థియేటర్ లో పురుడు పోసుకుంది. ఐతే చిన్న చిన్న రక్తపు మరకలు ఉన్నా కూడా ఒక పాజిటివిటీతో మీడియా ముందుకు తీసుకెళ్లింది. ఐతే ప్రేక్షకులంతా ఈ బేబీ మా బేబీ అని యాక్సెప్ట్ చేశారని అన్నారు. ఈ సినిమా కథ చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్ కానీ దాన్ని క్లీన్ కామెడీగా తీశామని ఆడియన్స్ అంటున్నారు. ఐతే దీనికి మెయిన్ రీజన్ స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచే ఫ్యామిలీస్ చూడాలని నిర్మాతలు కండీషన్స్ పెట్టారని చెప్పారు సంజీవ్ రెడ్డి.
సంతాన ప్రాప్తిరస్తు సినిమాకు నిర్మాతలు బజ్ క్రియేట్ చేశారు. ఐతే ఈ సినిమాకు హెవీ ఎమోషన్ అవసరమా అని కొందరు అన్నారు.. ఇంకా కావాలని మరికొంతమంది అన్నారు. చేతికున్న వేళ్లే ఒకలా ఉండవు.. సో రిలేటబుల్ కంటెంట్, ఎమోషన్ ఉండాలని అలా చేశామని అన్నారు డైరెక్టర్ సంజీవ్. సినిమా హీరో, హీరోయిన్ చాలా కష్టపడ్డారు.
మా హీరో సెకండ్ సినిమాకే డేరింగ్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాడు. అన్ని విధాలుగా సినిమాకు విక్రాంత్ సపోర్ట్ చేశాడని అన్నారు సంజీవ్ రెడ్డి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చాందిని ఉంటే బాగుంటుందని అనిపించింది. చాందిని చౌదరి ఈ కథకు ఒక వాల్యూస్ ఫేస్ అవుతుందని ఆమెను తీసుకున్నా ఆమె కూడా కథ వినగానే యాక్సెప్ట్ చేసిందని అన్నారు సంజీవ్.
సినిమాలో మురళీధర్ గారు బాగా చేశారు. డీజే టిల్లులో లాగా చైతన్య మామగా మీరు ఇచ్చిన థగ్ ఆఫ్ వార్ పెర్ఫార్మెన్స్ గురించి అందరు చెప్పుకుంటున్నారని అన్నారు. మిగతా కాస్ట్ అండ్ క్రూ అంతా సినిమాకు చాలా బాగా సపోర్ట్ చేశారని సంజీవ్ రెడ్డి అన్నారు.
ఐతే ఈమధ్య నెగిటివిటీ ఏ రేంజ్ కి వెళ్లింది అంటే ఐబొమ్మాని సపోర్ట్ చేసే స్టేజ్ కి వచ్చామని అన్నారు డైరెక్టర్ సంజీవ్. నెగిటివిటీ తగ్గిద్దాం.. కాన్సెప్ట్ సినిమాలు బ్రతికిద్దాం.. తెలుగు సినిమాను బ్రతికిద్దామని అన్నారు సంజీవ్ రెడ్డి.
