చరిత్ర సృష్టించబోతున్న సంజయ్ లీలా భన్సాలీ.. గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక స్థానం!
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన దర్శకులలో ఒకరిగా పేరు దక్కించుకున్నారు సంజయ్ లీల భన్సాలీ.
By: Madhu Reddy | 22 Jan 2026 3:41 PM ISTభారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన దర్శకులలో ఒకరిగా పేరు దక్కించుకున్నారు సంజయ్ లీల భన్సాలీ. తన సినిమాలతో ఊహించని విజయాలను సొంతం చేసుకున్న ఈయన ఒక తరాన్ని సినిమా నిర్మాణంలోకి తీసుకురావడానికి ఎంతో పాటుపడ్డారు. అలాంటి ఈయనకు ఇప్పుడు ఒక అరుదైన గౌరవం లభించబోతోంది. అంతేకాదు చరిత్ర సృష్టించబోతున్నారు అని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. వందేమాతరం పాట ప్రారంభించబడి ఈ ఏడాదికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ఈ గణతంత్ర దినోత్సవం వేడుకలలో భారతీయ సినిమా తరఫున సంజయ్ లీల భన్సాలీ ప్రాతినిధ్యం వహించనున్నారు.
జనవరి 26న జరగబోయే కార్యక్రమంలో సినిమా నేపథ్య శకటాన్ని ప్రదర్శిస్తారని నివేదికలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా ఇది భారతీయ సినిమాకు గర్వకారణమైన క్షణం అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు కోసం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సంజయ్ లీలా భన్సాలీతో కలసి పనిచేయనున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ విషయానికి వస్తే కథను చెప్పడం మాత్రమే కాదు ఆ కథను అత్యంత అద్భుతంగా తెరపై చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. ముఖ్యంగా అద్భుతమైన సినిమా శైలి ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందించాయి. హమ్ దిల్ చుకే సనమ్, దేవదాస్, బ్లాక్, బాజీరావు మస్తానీ, పద్మావత్, గంగూబాయి కతియావాడి వంటి ఎన్నో చిత్రాలు ఆయన స్థానాన్ని మరింత పదిలం చేశాయి..
ఇక బాలీవుడ్ దర్శకుడు, నటుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత , సంగీత దర్శకుడు, ఫిలిం అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి పూర్వ విద్యార్థిగా మంచి పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా అన్ని రంగాలలో పేరు ఘడించిన ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు దక్కించుకోవడం గమనార్హం. భన్సాలీ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థకు వ్యవస్థాపకుడు కూడా.. సంజయ్ తన పేరులోని లీలా అనే పేరును తల్లి లీలా భన్సాలీకి గుర్తుగా పెట్టుకున్నారు.
1996లో తన మొదటి చిత్రం ఖామోషి ది మ్యూజికల్ అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది .తర్వాత ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్లతో కలిసి హం దిల్ దే చుకే సనమ్ సినిమాతో మంచి విజయం సాధించారు. అంతేకాదు పురస్కారాలు కూడా అందుకున్నారు. అటు సినిమా రంగంలోనే కాకుండా ఇటు టెలివిజన్ రంగంలో కూడా మంచి పేరు దక్కించుకున్నారు. ఎన్నో సీరియల్స్ కి పనిచేసిన ఈయన ఓటిటి వెబ్ సిరీస్ లను కూడా నిర్మించారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తికి ఇప్పుడు భారత ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించబోతోంది.
