Begin typing your search above and press return to search.

మాజీ భర్త జయంతి.. నటి ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌

ఈ ఏడాది ఆరంభంలో చనిపోయిన సంజయ్‌ కపూర్‌ ఆస్తుల వ్యవహారం కోర్ట్‌లో ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన సంజయ్ కపూర్‌ మూడు పెళ్లిలు చేసుకున్నాడు.

By:  Ramesh Palla   |   17 Oct 2025 11:59 AM IST
మాజీ భర్త జయంతి.. నటి ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌
X

ఈ ఏడాది ఆరంభంలో చనిపోయిన సంజయ్‌ కపూర్‌ ఆస్తుల వ్యవహారం కోర్ట్‌లో ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన సంజయ్ కపూర్‌ మూడు పెళ్లిలు చేసుకున్నాడు. చనిపోయే సమయంలో మూడో భార్యతో ఉన్నాడు. మొదటి ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు రెండో భార్య కరిష్మా కపూర్‌ పిల్లలు ఆస్తుల కోసం కోర్ట్‌ను ఆశ్రయించారు. కరిష్మా కపూర్‌ను 2003లో సంజయ్‌ కపూర్‌ వివాహం చేసుకున్నాడు. దాదాపుగా 13 ఏళ్ల పాటు వీరి వైవాహిక జీవితం సాగింది. ఆ సమయంలోనే వీరికి ఇద్దరు పిల్లలు సమైరా, కియాన్‌లు జన్మించారు. కరిష్మా కపూర్‌తో విడాకుల తర్వాత సమైరా, కియాన్‌లతో సంజయ్ కపూర్‌ సన్నిహితంగానే ఉంటూ వచ్చాడు. అయితే 2017లో ప్రియాను వివాహం చేసుకున్న తర్వాత పిల్లలను దూరం పెట్టాడు అనేది బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధానమైన టాక్‌.


సంజయ్‌ కపూర్‌ ఫ్యామిలీ ఆస్తి తగాదాలు

సంజయ్ కపూర్‌ ఆకస్మికంగా మృతి చెందారు. ఆ సమయంకు ఆయన వీలునామా రాసే అవకాశం లేదని చాలా మంది అంటున్నారు. కానీ ప్రియా మాత్రం వీలునామా ఉంది, ఆస్తులు అన్నీ కూడా తనపేరు మీదకు వస్తాయి అన్నట్లుగా వీలునామాను చూపించడంతో వివాదం మొదలైంది. తండ్రి ఆస్తిలో కియాన్‌, సమైరాలు వాటా కోసం చూస్తున్నారు. సంజయ్‌ కపూర్‌ కి ప్రియా ద్వారా ఒక బిడ్డ జన్మించారు. మొత్తంగా ఆయనకు ముగ్గురు సంతానం. ఆ ముగ్గురికి ఆస్తిని సమానంగా పంచాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాల్లో కొందరు, సంజయ్‌ సన్నిహితులు కొందరు అనుకుంటున్నారు. కానీ ప్రియా మాత్రం వీలునామా ప్రకారం ఆస్తి మొత్తం తనకు, తన బిడ్డకు రావాల్సిందే అని పట్టుబడుతుంది. ఈ సమయంలో సంజయ్ కపూర్‌ మొదటి జయంతి వచ్చింది. ఈసమయంలో కరిష్మా సోషల్‌ మీడియా పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

కరిష్మా కపూర్‌ మాజీ భర్త

ఒక వైపు సమైరా, కియాన్‌లు తండ్రి సంజయ్ కపూర్‌ ఆస్తి కోసం కోర్ట్‌ ద్వారా పోరాటం చేస్తున్నారు. తప్పుడు వీలునామాను సృష్టించి ఆస్తిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ వారు కోర్ట్‌ ద్వారా ఆరోపిస్తున్నారు. ప్రియా మాత్రం తన భర్త ఆస్తిపై తనకు హక్కు ఉంటుందని, అందుకు తగ్గట్లుగా తన వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని అంటుంది. ఈ ఆస్తి విషయమై కరిష్మా కపూర్‌ స్పందించడం లేదు. కానీ ఆమె పిల్లలు మాత్రమే న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే సంజయ్ కపూర్‌ జయంతి సందర్భంగా కియాన్‌, సమైరా కట్‌ చేసిన కేక్‌ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. సంజయ్‌ కపూర్‌తో పూర్తిగా కరిష్మా బంధం తెంచుకుంది. విడాకుల తర్వాత ఎప్పుడూ ఆయన గురించి పెద్దగా స్పందించలేదు, ఇప్పుడు ఇన్‌స్టాలో ఆయన జయంతి సందర్భంగా పోస్ట్‌ పెట్టడం విడ్డూరంగా ఉందని కొందరు విమర్శిస్తున్నారు.

సమైరా, కియాన్‌ల న్యాయ పోరాటం

సమైరా, కియాన్‌ల కోసం అన్నట్లుగా మీ తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే ఉంటాయి అంటూ కరిష్మా డాడీ అని ఉన్న కేక్‌ ఫోటోను షేర్‌ చేసింది. తద్వారా సంజయ్‌ కపూర్‌ గురించి ఆమె పోస్ట్‌ చేసినట్లు అయిందని పలువురు మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి సమైరా, కియాన్‌లు కోర్ట్‌ ద్వారా ఆస్తిలో హక్కు కోసం పోరాటం చేస్తున్నారు. పలు మీడియా కథనాల అనుసారం సంజయ్ కపూర్‌ చనిపోయే నాటికి ఆయన ఆస్తుల విలువ దాదాపుగా రూ.30 వేల కోట్లుగా తెలుస్తోంది. అందులో సగం అయినా తమ వాటాగా ఇవ్వాల్సిందే అంటూ సమైరా, కియాన్‌లు న్యాయం స్థానంలో పోరాటం చేస్తున్నారు. ప్రియా పోర్జరీ చేశారు అంటూ వీలునామాపై కరిష్మా కపూర్‌ పిల్లలు సమైరా, కియాన్‌లు కోర్ట్‌లో చేస్తున్న పోరాటం ఎంత వరకు విజయాన్ని సాధిస్తారు అనేది చూడాలి. ఈ సమయంలో కరిష్మా చేసిన ఎమోషనల్‌ పోస్ట్‌ కియాన్‌, సమైరాలకు మద్దతుగా ఎంతో మంది నిలిచేలా చేస్తుంది.