Begin typing your search above and press return to search.

మూడు 1000 కోట్ల క్లబ్ చిత్రాల్లో నటించిన ఏకైక భారతీయ నటుడు!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డుల గురించి చర్చ వస్తే సాధారణంగా ఇటీవ‌ల‌ సౌత్ సూపర్ స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   30 March 2026 9:30 AM IST
మూడు 1000 కోట్ల క్లబ్ చిత్రాల్లో నటించిన ఏకైక భారతీయ నటుడు!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డుల గురించి చర్చ వస్తే సాధారణంగా ఇటీవ‌ల‌ సౌత్ సూపర్ స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఖాన్ ల త్ర‌యంలో షారూఖ్‌, అమీర్ ఖాన్ 1000 కోట్ల క్ల‌బ్ ల‌ను అందుకున్నారు. కానీ ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలిస్తే బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. మూడు 1000 కోట్ల క్లబ్ చిత్రాల్లో నటించిన ఏకైక భారతీయ నటుడిగా అత‌డు సరికొత్త చరిత్ర సృష్టించారు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ.. బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయాలను అందుకుంటున్న సంజయ్ దత్ ఇప్పుడు ఇండియన్ సినిమాకు `గోల్డెన్ లెగ్`గా మారిపోయారు.

సంజయ్ దత్ సాధించిన ఈ అరుదైన రికార్డులో షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి టాప్ స్టార్లను సైతం వెనక్కి నెట్టడం విశేషం. ఈ ప్రయాణం కన్నడ బ్లాక్‌బస్టర్ `కెజియఫ్ 2`తో మొదలైంది. యష్ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రంలో సంజయ్ దత్ `అధీర`గా పోషించిన క్రూరమైన విలన్ పాత్రకు గొప్ప పేరొచ్చింది. కేజీఎఫ్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా సాధించిన విజయం సంజయ్ దత్ కెరీర్‌ను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా.. పెద్ద సినిమాలకు అత‌డు ఒక ఆకర్షణగా మారేలా చేసింది.

ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన `జవాన్` చిత్రంలో సంజయ్ దత్ ఒక ప్రత్యేక అతిథి పాత్రలో మెరిశారు. కేవలం కొద్ది నిమిషాల పాటే తెరపై కనిపించినా ఆ సినిమా 1100 కోట్లకు పైగా వసూలు చేయడంతో అత‌డి ఖాతాలో మరో వెయ్యి కోట్ల సినిమా చేరింది. అదేవిధంగా దళపతి విజయ్ నటించిన తమిళ చిత్రం `లియో`లో కూడా సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం కూడా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల మార్కును అందుకుంది.

ఇక తాజాగా రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన `ధురంధర్ 2` కూడా 1000 కోట్ల క్లబ్‌లో చేరడంతో సంజయ్ దత్ ఖాతాలో మూడో వెయ్యి కోట్ల క్ల‌బ్ సినిమా నమోదైంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ రెండు 1000 కోట్ల చిత్రాలతో (పఠాన్, జవాన్) రెండో స్థానంలో ఉండగా.. సంజయ్ దత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అలాగే షారూఖ్ తో పాటు ఇప్పుడు ర‌ణ్ వీర్ సింగ్ దురంధ‌ర్, దురంధ‌ర్ 2 చిత్రాల‌తో వ‌రుస‌గా రెండు 1000 కోట్ల క్ల‌బ్ ల‌ను అందుకుంటున్నాడు. సంజూభాయ్ రికార్డ్ బ్రేకింగ్ చిత్రాల‌ను ప‌రిశీలిస్తే... అత‌డు కేవలం సోలో హీరోగా కాకుండా విలన్‌గా, సహాయ నటుడిగా..అతిథి పాత్రల్లో నటించిన చిత్రాలు ఉండటం గమనార్హం. ఇది ఆయనకున్న వెర్సటాలిటీని .. క్రేజ్‌ను చాటిచెబుతోంది.

పెద్ద హీరోల చిత్రాల్లో లేదా భారీ మల్టీ-స్టారర్లలో సంజయ్ దత్ ఉండటం ఆ సినిమాల స్థాయిని.. వసూళ్లను అమాంతం పెంచుతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తనదైన మేనరిజమ్స్.. వాయిస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంజూ మునుముందు మరిన్ని భారీ ప్రాజెక్టులకు సంతకం చేయ‌బోతున్నారు. ఒక నటుడిగా తనను తాను మలుచుకుంటూ... మారుతున్న కాలానికి అనుగుణంగా న‌ట‌న ప‌రంగా దూసుకెళుతూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న సంజయ్ దత్ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.