Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఫస్ట్ కెప్టెన్ ఎవరంటే..?

ఐతే ఓనర్స్ కి ట్విస్ట్ ఇస్తూ బిగ్ బాస్ సంజనని కంఫెషన్ రూం లోకి పిలిచాడు. ఆమెకు కెప్టెన్సీ టాస్క్ కోసం మెంబర్స్ ని ఎంపిక చేయమని అన్నాడు.

By:  Ramesh Boddu   |   11 Sept 2025 3:28 PM IST
బిగ్ బాస్ 9.. ఫస్ట్ కెప్టెన్ ఎవరంటే..?
X

బిగ్ బాస్ సీజన్ 9 లో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. ఓనర్స్, టెనంట్స్ మధ్య రెండు, మూడు రోజులుగా గొడవలకు కారణమైన సంజనాకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. మొన్న బాత్ రూమ్ ఇష్యూ, నిన్న ఎగ్ ఇష్యూ ఈ రెండిటిలో సంజన మిస్టేక్ వల్ల మిగతా హౌస్ మెట్స్ మాటలు పడ్డారు. ఆమె తప్పు చేసినా సరే ఎంచక్కా సారీ అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. ఐతే ఓనర్స్ కి ఈ విషయంలో ఆమె ప్రవర్తన నచ్చలేదు. అందుకే ఆమెను 2 డేస్ వరకు హౌస్ లోకి రాకుండా కండీషన్ పెట్టారు.

2 డేస్ హౌస్ లోకి రావొద్దని..

మిగతా టెనంట్స్ కి కూడా కేవలం 6 టైంస్ మాత్రమే హౌస్ లోకి వచ్చే పర్మిషన్ ఇచ్చారు. సంజన ఎగ్ తీసినా సరే తమకు చెప్పలేదని టెనట్స్ మెంబర్స్ రాము, భరణి, తనూజలకు టెనంట్స్ ఆరు సార్లు అయిపోయాక కూడా హౌస్ లో ఏవైనా కావాలంటే ఆ ముగ్గురు ద్వారా పనిచేయించుకోవాలని అన్నారు. ఐతే 2 డేస్ హౌస్ లోకి రావొద్దని సంజనకి ఓనర్స్ చెప్పగా.. దానికి ఆమె చాలా కూల్ గా ఒప్పేసుకుంది.

ఐతే ఓనర్స్ కి ట్విస్ట్ ఇస్తూ బిగ్ బాస్ సంజనని కంఫెషన్ రూం లోకి పిలిచాడు. ఆమెకు కెప్టెన్సీ టాస్క్ కోసం మెంబర్స్ ని ఎంపిక చేయమని అన్నాడు. ఆమె హరీష్, డెమాన్ పవన్, శ్రష్టి వర్మని ఎంపిక చేసింది. ఐతే ఫైనల్ గా సంజనాకే ఈ వారం కెప్టెన్సీ గా ఛాన్స్ దక్కింది. అలా సంజన కెప్టెన్ అయ్యింది.

కెప్టెన్ కి సెపరేట్ బెడ్..

కెప్టెన్ అంటే హౌస్ అంతా ఆమె ఆధీనంలో ఉంటుంది. ఓనర్స్ అంత ఉన్నా కూడా కెప్టెన్ కి సెపరేట్ బెడ్ అన్నీ సౌకర్యాలు ఉంటాయి. సంజకై బిగ్ బాస్ ఈ ఛాన్స్ ఇవ్వడం మిగతా హౌస్ మెట్స్ కి షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ 9 లో హౌస్ అంతా ఒక వైపు ఉంటే సంజన మరో వైపు ఉంది. అందుకే ఆమెను కెప్టెన్ గా చేసి బిగ్ బాస్ తన ఆట మొదలు పెట్టాడు. మరి ఈ వారం కెప్టెన్ అంటే నెక్స్ట్ వీక్ ఆమె హౌస్ లో సేఫ్ అన్నట్టే. ఐతే ఈవారం సంజన నామినేషన్స్ లో ఉంది.

ఆమె ఈ వీక్ సేఫ్ అయితే 3వ వారం దాకా ఉంటుంది. సంజన కెప్టెన్ అవ్వడంతో ఓనర్స్ తో పాటు టెనంట్స్ కి షాక్ తగిలింది. నెక్స్ట్ కెప్టెన్ గా సంజన తీసుకునే నిర్ణయాలు ఇంకెలా ఉంటాయన్నది చూడాలి. ఐతే ఆడియన్స్ కి సంజన కెప్టెన్ అయ్యిందన్న విషయం కూడా సర్ ప్రైజ్ చేస్తుంది.