Begin typing your search above and press return to search.

ఆఫ్టర్ బిగ్ బాస్ బిజినెస్ మొదలు పెట్టిన సంజనా..!

బిగ్ బాస్ సీజన్ 9లో సంజనా టాప్ 5గా ఎలిమినేట్ అయ్యింది. ఈ సీజన్ లో ఏదో ఒక విధంగా హౌస్ లో హడావిడి చేసింది సంజనా గర్లాని.

By:  Ramesh Boddu   |   27 Dec 2025 12:53 PM IST
ఆఫ్టర్ బిగ్ బాస్ బిజినెస్ మొదలు పెట్టిన సంజనా..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో సంజనా టాప్ 5గా ఎలిమినేట్ అయ్యింది. ఈ సీజన్ లో ఏదో ఒక విధంగా హౌస్ లో హడావిడి చేసింది సంజనా గర్లాని. రెండో వారమే ఎగ్స్ దొంగతనం నుంచి ఆమె తన ఆటని అందరి కంటెస్టెంట్స్ కి భిన్నంగా ఆడుతూ వచ్చింది. ఐతే ఫైనల్ వీక్ లో తాను ఉంటుందా ఉండదా అన్న టెన్షన్ ఉండగా భరణి ఎలిమినేట్ అయ్యి సంజనాకి ఆ ఛాన్స్ దక్కింది. ఐతే సంజనా 15 వారాల హౌస్ ఎక్స్ పీరియన్స్ ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా హౌస్ లో ఆమె ఇమ్మాన్యుయెల్ తో మదర్ అండ్ సన్ బాండింగ్ బాగా ఎంటర్టైన్ చేసింది.

సంజనా ప్రీ స్కూల్ ప్రమోషన్..

ఐతే హౌస్ నుంచి బయటకు వచ్చిన సంజనా వెంటనే ఈ క్రేజ్ తోనే తన బిజినెస్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం మొదలు పెట్టింది. సంజనా హౌస్ లో నుంచి ఇలా వచ్చిందో రాలేదో అలా తను మొదలు పెట్టిన ఒక ప్రీ స్కూల్ గురించి ప్రమోషన్ మొదలు పెట్టింది. కర్ణాటకలో సంజనా స్ప్రౌటింగ్ బ్రిలియన్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ప్రీ స్కూల్ ని స్టార్ట్ చేసింది. 3 ఫ్లోర్స్ తో ఆమె మొదలు పెట్టిన ఈ ప్రీ స్కూల్ గురించి లేటెస్ట్ గా ఒక వీడియో చేసింది.

ఆఫ్టర్ బిగ్ బాస్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సంజనా దూకుడు చూపిస్తుంది. ఐతే ఆమె గ్లామర్ ఫీల్డ్ లో మళ్లీ బిజీ అవ్వాలనే ఆలోచన ఉన్నా ప్రస్తుతం బిగ్ బాస్ వల్ల వచ్చిన ఈ క్రేజ్ తో తన స్కూల్ ని డెవలప్ చేసే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే తన ప్రీ స్కూల్ కి సంబంధించిన వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. సంజనా మాత్రమే కాదు కన్నడలో తన స్కూల్ ని ఇంకా డెవలప్ చేసేలా ఆమె బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి సంబంధించిన మరి కొంతమందితో కూడా ప్రమోషన్ చేస్తుందా అన్నది చూడాలి.

బిగ్ బాస్ తెలుగు తో సెకండ్ ఇన్నింగ్స్..

తెలుగులో ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం సినిమాలతో అలరించిన సంజనా తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. ఐతే ఆఫ్టర్ మ్యారేజ్ సినిమా ఛాన్స్ లు అందుకోని ఆమె బిగ్ బాస్ తెలుగు తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని చూస్తుంది. సంజనాకి ఈ బిగ్ బాస్ క్రేజ్ ఎంతవరకు కెరీర్ లో జోష్ అందిస్తుంది అన్నది చూడాలి.

బిగ్ బాస్ సీజన్ 9లో సంజనా ఆట తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. మొదట్లో కాస్త చిరాకు తెప్పించినా ఆ తర్వాత హౌస్ పరిస్థితులకు తగినట్టుగా ఆకట్టుకుంది. ఇక టాప్ 5లో ఆమె ఉండటం కూడా ఆమె పెట్టిన ఎఫర్ట్స్ కి అర్హురాలే అనిపించింది.