బిగ్ బాస్ 9.. టాప్ 5 కోసం సంజన ఫైట్..!
ఇక బుధవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఈసారి ఆట నుంచి ఇద్దరిని తీసేయాలని బిగ్ బాస్ చెప్పాడు.
By: Ramesh Boddu | 11 Dec 2025 10:53 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఫైనల్ వీక్ కి వారం ముందు కూడా హౌస్ లో హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా సంజనా అయితే మంగళవారం తనూజ మీద ఫైర్ అవ్వగా బుధవారం ఎపిసోడ్ లో డీమాన్ పవన్ మీద సీరియస్ అయ్యింది. లీడర్ బోర్డ్ పాయింట్స్ లో ఒకసారి టాస్క్ తో పాయింట్స్ ఇస్తున్న బిగ్ బాస్ రెండోసారి మాత్రం హౌస్ మేట్స్ అంతా కలిసి ఒకరికి జీరో ఇవ్వాలని చెప్పాడు. ఆల్రెడీ బుధవారం సంజనాని తీసేశారని ఆమె చాలా ఎమోషనల్ అయ్యింది.
భరణి, తనూజ, సంజన, సుమన్ మధ్య టాస్క్..
ఇక బుధవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఈసారి ఆట నుంచి ఇద్దరిని తీసేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టైం లో అందరు కూడా టాప్ 2 అంటే ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్ పేరు చెప్పారు. ఐతే సంజన నిన్న కూడా డీమాన్ పవన్ పేరు చెప్పింది. ఈరోజు కూడా అతని పేరు చెప్పడం అతన్ని హర్ట్ చేసింది. ఆ విషయంపై ఆమెతో సరదాగా మొదలైన పరిస్థితి కాస్త ఆమె సీరియస్ అయ్యి 10 వారాలుగా చస్తున్నా అంటూ ఎమోషనల్ అయ్యింది.
అందుకే భరణి, సుమన్, తనూజ కూడా ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్ కి ఓటు వేశారు. సో ఈ టాస్క్ నుంచి ఆ ఇద్దరు తప్పుకోగా భరణి, తనూజ, సంజన, సుమన్ మధ్య టాస్క్ పెట్టారు. ఆ టాక్ లో భరణి ఫస్ట్ ప్లేస్, తనూజ సెకండ్ ప్లేస్ వచ్చింది. ఈసారి లీడర్ బోర్డ్ లో ఫైనల్ గా టాప్ పాయింట్స్ ఉన్న వారు నామినేషన్స్ నుంచి సేఫ్ అవుతారు. అందుకే సంజనా ఎలాగైనా లీడర్ బోర్డ్ లో టాప్ లో ఉండి టాప్ 5లో ప్లేస్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది.
టాస్క్ లో థర్డ్ ప్లేస్ లో..
సంజనా పాయింట్స్ పెట్టడం వరకు బాగానే ఉన్నా ఆమె ఫ్లిప్ సైడ్ ఆమెకు మైనస్ అవుతుంది. ఇమ్మాన్యుయెల్ కి తన సపోర్ట్ అని చెబుతూ అతనికి జీరో పాయింట్స్ ఇచ్చేందుకు ఓటు వేయడం అసలు గొడవకు దారి తీస్తుంది. ఎలాగోలా సెకండ్ డే జీరో పాయింట్స్ తప్పించుకున్న సంజనా టాస్క్ లో థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ఐతే సంజనా టాప్ 5 ఉంటుందా ఈ వారం ఎలిమినేట్ అవుతుందా అన్నది ఈ సండే రోజు తెలుస్తుంది. టాప్ 5లో తాను ఉండేందుకు సంజనా అన్నివిధాలుగా ప్రయత్నిస్తుంది.
ఈ వారం నామినేషన్స్ కళ్యాణ్ తప్ప మిగతా హౌస్ మేట్స్ అంతా ఉన్నారు. ఐతే వీరిలో డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి, సంజనా ఉన్నారని తెలుస్తుంది. ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారా లేదా డబల్ ఎలిమినేషన్ అని చెప్పి ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తారా అన్నది చూడాలి.
