ఒణికిపోయిన ఒంటరి తల్లి సానియా మిర్జా..!
ఇదే చాటింగ్ సెషన్ లో ఫరాఖాన్ తన తండ్రి చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమవ్వడంతో తాము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన తెలిపారు.
By: Sivaji Kontham | 14 Nov 2025 12:00 AM ISTభారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తన భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 14 సంవత్సరాల వైవాహిక బంధానికి ఈ జంట ముగింపు పలికింది. అయితే సానియా బ్రేకప్ తర్వాత చాలా సార్లు పానిక్ కి గురైన విషయాన్ని తన స్నేహితురాలు, డైరెక్టర్ ఫరాఖాన్ తో టీవీ షోలో బయటపెట్టడం చర్చగా మారింది.
పలుమార్లు సానియా ప్యానిక్ గా మారిందని ఫరా ఈ షోలో అన్నారు. తన స్నేహితురాలు సానియా ఒంటరితనాన్ని తలచుకుని ఫరా ఖాన్ ఎంతగా కలత చెందారో కూడా ఆమె మాటలు చెబుతున్నాయి. 2024లో సానియా- షోయబ్ విడిపోయారు. ఒక ఒంటరి తల్లిగా జీవించడం ఎంత కష్టమో తెలుసునని ఫరా అన్నారు. ``నువ్వు ఇప్పుడు ఒంటరి తల్లివి. ఒంటరి తల్లిగా ఉండటం కంటే కష్టం ఇంకేదీ లేదు. ఇది చాలా చాలా కష్టం. మనందదరికీ మన ప్రయాణాలు ఉంటాయి.. ఏది ఉత్తమమైనదో ఎంచుకోవాలి`` అని ఫరా అన్నారు.
`సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా` అనే యూట్యూబ్ షోలో తన స్నేహితురాలు, చిత్రనిర్మాత ఫరా ఖాన్‌తో సంభాషణ సందర్భంగా సానియా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. విడాకుల తర్వాత పలుమార్లు ప్యానిక్ అయినట్టు అంగీకరించారు. ఓవైపు ఉద్యోగం, మరోవైపు పిల్లల చదువులు, పెంపకం వగైరా విషయాలలో తాను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. ఇటీవల తాను ఒక లైవ్ టీవీ షోకి వెళ్లినప్పుడు ఒణికిపోయానని సానియా తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఫరా ఉండటంతో ధైర్యం వచ్చిందని కూడా అన్నారు. నువ్వు అలా ఒణికిపోవడం ఎప్పుడూ చూడలేదు.. అని ఫరా ఆ సమయం గురించి గుర్తు చేసుకున్నారు.
నిజానికి సానియా- షోయబ్ జంట విడిపోతున్న విషయాన్ని సానియా సోదరి ఆనమ్ స్వయంగా ప్రకటించారు. ఆ ఇద్దరూ చాలా కాలంగా విడివిడిగా ఉంటున్నారని, ఇప్పుడు అధికారికంగా విడిపోయారని సోషల్ మీడియాల్లో వెల్లడించారు.
ఇదే చాటింగ్ సెషన్ లో ఫరాఖాన్ తన తండ్రి చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమవ్వడంతో తాము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన తెలిపారు. అయితే ఇది అన్ని పరిశ్రమల్లో ఉన్నదే. బాలీవుడ్ కఠినంగా ఉంటుందని ఎవరైనా చెబితే, నేను జీవితం కఠినమైనదని నమ్ముతానని ఫరా అన్నారు. ఐదారేళ్ల వయసులోనే తాను ఇలాంటివి చూసానని తెలిపారు. ఫెయిలైతే ఎవరూ మనల్ని పట్టించుకోరని కూడా ఫరా ఖాన్ అన్నారు.
భార్య సానియా మీర్జా నుండి విడాకులు తీసుకున్న తర్వాత క్రికెటర్ షోయబ్ మాలిక్ నెలల వ్యవధిలోనే పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతడి వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
