Begin typing your search above and press return to search.

సానియా లగ్జరీ లైఫ్.. ఏ రేంజ్ లో ఉందంటే..

సానియా ప్రస్తుతం దుబాయ్ లో ఉంటుంది. కెరీర్ లో టెన్నిస్ కోర్టులో మెరిసిన సానియా.. కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటోంది. ఈమె అప్డేట్లు, లైఫ్ స్టైల్ ఇందులో షేర్ చేస్తుంటుంది.

By:  M Prashanth   |   22 Sept 2025 10:14 PM IST
సానియా లగ్జరీ లైఫ్.. ఏ రేంజ్ లో ఉందంటే..
X

సెలబ్రిటీలు అంటేనే లగ్జరీ లైఫ్. వాళ్లు ధరించే బట్టలు, ఉంటే ఇళ్లు, తిరిగే కార్లు అన్నీ ఖరీదైనవీ, బ్రాండెడ్ వి ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ల లైఫ్ స్టైల్ కాస్ట్లీగా ఉంటుంది. ఈ లిస్ట్ లో ఎక్కువగా సినీ తారలు, రాజకీయ నాయకులు, అథ్లెట్లు ఉంటారు. సోషల్ మీడియాలో ఎక్స్ పోజింగ్ లో ఇవి నెటిజన్లను ఆకర్షిస్తాయి. తాజాగా అలాంటిదే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు సంబంధించి ఓ పోస్ట్ తెగ వైరల్ గా మారింది. అందులో ఆమె లగ్జరీ లైఫ్ పైనే నెటిజన్ల దృష్టి పడింది.

సానియా ప్రస్తుతం దుబాయ్ లో ఉంటుంది. కెరీర్ లో టెన్నిస్ కోర్టులో మెరిసిన సానియా.. కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటోంది. ఈమె అప్డేట్లు, లైఫ్ స్టైల్ ఇందులో షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో ఆమె అమ్మా, నాన్నలతోపాటు కొడుకు కూడా ఉన్నాడు.

బర్త్ డే సెలబ్రేషన్స్ లో కేక్ కట్టింగ్, క్యాజువల్ ఫోటోలు ఉన్నాయి. అయితే ఇందులో ఆమె ఓ లగ్జరీ కారులో కూర్చొని కెమెరాకు ఫోజిచ్చిన ఫొటోపైనే ఇప్పుడు నెటిజన్లు దృష్టి పడింది. ఆమె ప్రముఖ లగ్జరీ కారు పోర్షా 718 బాక్సటర్ కారులో కూర్చున్న ఫోటో అప్లోడ్ చేసింది. ఈ ఖరీదైన కారును ఆమె ఈ ఏడాది ప్రారంభంలో కొనుగోలు చేసింది. మొత్తం పోస్ట్ లో ఈ ఫోటోనే హైలైట్ అయ్యింది.

కారులో తన తండ్రిని కూర్చొబెట్టుకొని రైడ్ కు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఎల్లో కలర్ కారు పైన బ్లాక్ కోటింగ్ తో కారు నెక్ట్స్ లెవెల్ లో కనిపిస్తుంది. అయితే సానియాకు కార్లంటే ఎప్పుడూ ఇష్టమే. ఇప్పుడు ఈ ఖరీదైన వెహికిల్ ఆమె కలెక్షన్లలో లగ్జరీని తెలియజేస్తుంది. ఇక్కడ కేవలం లగ్జరీనే కాదు, ఆమె తండ్రి రైడ్ ను ఆస్వాదిస్తున్నారు. కుటుంబం అంతా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

కానీ ఫ్యాన్స్, నెటిజన్ల దృష్టి ఆటోమేటిగ్ గా కారు మీదకు పోవడం సహజమే. పోర్షా కారుపైకి అటెన్షన్ పోయినా.. తన పోస్టులతో ఫ్యామిలీ ముూమెంట్స్ ను తెలియజేస్తుంటుంది. ఇక సానియా 2023లో ఆటకు గుడ్ బై చెప్పేసింది. దుబాయ్ లో ఉంటూనే.. ఫిల్మ్ నగర్ లో ఉన్న స్పోర్ట్స్ అకాడెమీతో టచ్ లో ఉంటుంది. ఆమెతోపాటు తన సోదరి ఆనమ్ మీర్జా కూడా ఉంటుంది. ఆనమ్ సానియాతో హైదరాబాద్- దుబాయ్ తిరుగుతుంటుంది. ఆమెకు వ్యాపారాల్లోనూ సహకరిస్తుంది.