Begin typing your search above and press return to search.

మానస.. నేను బూతులు మాట్లాడుకుంటాం: సంగీత్ శోభన్

యంగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాకాస విడుదలకు సిద్ధమవుతోంది.

By:  M Prashanth   |   1 April 2026 10:27 AM IST
మానస.. నేను బూతులు మాట్లాడుకుంటాం: సంగీత్ శోభన్
X

యంగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాకాస విడుదలకు సిద్ధమవుతోంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రాన్ని నిహారిక కొణిదెల నిర్మిస్తున్నారు. సంగీత్ సరసన నయన్ సారిక హీరోయిన్‌ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి సహా పలువురు నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఆ మూవీ.. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ ను వేగవంతం చేసింది. రీసెంట్ గా హైదరాబాద్‌ లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఆ కార్యక్రమంలో హీరో సంగీత్ శోభన్.. దర్శకురాలు మానసపై ప్రశంసలు కురిపించారు. వారి మధ్య ఉన్న రిలేషన్, ఆమె వర్క్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. "మానస శర్మతో నాకు 2021 నుంచి పరిచయం ఉంది. అప్పటి నుంచి మేమిద్దరం తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆమె గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. నాకోసం ఆమెకు అన్నీ తెలుసు. ఎలాంటి విషయమైనా ఓపెన్‌ గా చర్చించుకుంటాం. మధ్య మధ్యలో బూతులు మాట్లాడుకుంటాం (నవ్వుతూ)" అని సంగీత్ శోభన్ తెలిపారు.

మానస శర్మలో తనకు నచ్చిన ముఖ్య లక్షణం గురించి చెబుతూ.. "సినిమా అంటే రిలీజ్ చేసి జనాలకు చూపించి వదిలేయడం కాదు.. జనాలు గుర్తుపెట్టుకోవాలి.. సినిమాను ఇంటికి పట్టుకెళ్ళాలి అన్న ధోరణిలో ఎప్పుడూ ఉంటారు. ఆడియన్స్ కు రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్. సినిమా అనేది చేసి వదిలేస్తే సరిపోదు.. ఆడియన్స్ కు నచ్చేలా చేయాలి.. వాళ్ల కట్టిన టికెట్ డబ్బులకు వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి.. మంచి కథ ఇవ్వాలి.. ఇప్పుడు రాకాస సినిమా విషయంలో అదే ధోరణితో ఉన్నారు" అని చెప్పారు.

సినిమా నిర్మాణంలో దర్శకుడి పాత్ర గురించి సంగీత్ శోభన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఒక యాక్టర్ తన పాత్రలో పనిచేస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అందిస్తాడు. కానీ దర్శకుడు మాత్రం అన్ని విభాగాల్లో పనిచేస్తాడు. ప్రతి విభాగానికి దర్శకుడు మొదటి అసిస్టెంట్ లా ఉంటారు. ఎందుకంటే డైరెక్టర్ విజన్ ఆధారంగా మేమంతా పనిచేస్తాం" అని వివరించారు.

"రాకాస సినిమాకు ఆమె కేవలం కెప్టెన్ మాత్రమే కాదు.. అన్నీ ఆమెనే. కథ రాసుకున్న తీరు నుంచి తెరకెక్కించిన విధానం వరకు ప్రతి అంశంలో ఆమె ప్రతిభ కనిపిస్తుంది. ఈ సినిమాను ఆమె తప్ప మరెవరూ చేయలేరు. మానస శర్మ నాకు దర్శకురాలు మాత్రమే కాదు, గైడ్ కూడా. ఆమెతో కలిసి పని చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞుడిని. ఇండస్ట్రీ గమనిస్తోంది. ఏప్రిల్ 3న మానస శర్మ ఎవరో అందరికీ తెలుస్తుంది. ఆమె ఇంకా పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు. ప్రస్తుతం సంగీత్ శోభన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.