Begin typing your search above and press return to search.

నాగవంశీ 'మ్యాడ్ స్క్వేర్'.. ఇప్పుడేంటి చర్చ?

మ్యాడ్ స్క్వేర్.. సూపర్ హిట్ గా నిలిచిన మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా రూపొందిన ఆ సినిమా మంచి విజయం సాధించింది.

By:  M Prashanth   |   8 March 2026 11:00 AM IST
నాగవంశీ మ్యాడ్ స్క్వేర్.. ఇప్పుడేంటి చర్చ?
X

మ్యాడ్ స్క్వేర్.. సూపర్ హిట్ గా నిలిచిన మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా రూపొందిన ఆ సినిమా మంచి విజయం సాధించింది. టాలీవుడ్ యంగ్ హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్ లీడ్ రోల్స్ లో నటించిన ఆ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ చిత్రాన్ని యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద మరో సక్సెస్ అందుకున్నారు.

ముఖ్యంగా సినిమా యూత్ ఆడియన్స్‌ ను విశేషంగా ఆకట్టుకుంటూ, మొదటి భాగం కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసిందని చెప్పాలి. అయితే మ్యాడ్ స్క్వేర్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది అయిపోతుంది. కానీ ఇప్పుడు ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. అందుకు కారణం ఆ మూవీలో యాక్ట్ చేసిన యంగ్ హీరో సంగీత్ శోభన్ చేసిన కామెంట్సే.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మ్యాడ్ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేదని తెలిపారు. ఆ సక్సెస్ ఎంజాయ్ చేసే మూడ్‌ లో ఉండిపోయామని, మ్యాడ్ స్క్వేర్‌ ను చాలా తక్కువ సమయంలో పూర్తి చేసేశామని తెలిపారు. నిర్మాత నాగవంశీ కాబట్టి ఆ మూవీ చేశారని, లేకుంటే మ్యాడ్ లాంటి సినిమా చేసే దమ్మున్న ప్రొడ్యూసర్ మరెవరూ లేరని అభిప్రాయపడ్డారు

సినిమాలో క్రైమ్ కామెడీ ట్రాక్‌ పై మరింత ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేదని తన అభిప్రాయమని, ఒకవేళ కథలో రిస్క్ పెంచి ఉంటే అవుట్‌ పుట్ మరోలా ఉండేదని చెప్పారు. అయితే మొదటి భాగం కంటే సెకండ్ పార్ట్ బాగుందని అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని అన్నారు. కానీ ఏదైనా కొత్తగా ప్రయత్నించి ఉండాల్సిందని అనిపిస్తుందని, ఛాన్స్ ఇస్తే మూవీ తాను చేయకపోయేవాడినని సంగీత్ శోభన్ చెప్పారు.

దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో మ్యాడ్ స్క్వేర్ మూవీ తో పాటు నాగవంశీ కోసం కూడా చర్చ సాగుతోంది. సినిమా ఎలా తీశామన్నది పక్కన పెడితే.. దమ్మున్న ప్రొడ్యూసర్స్ లో ఆయన ఒకరని నెటిజన్లు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే అది ప్రూవ్ అయిందని చెబుతున్నారు. మ్యాడ్ స్క్వేర్ ను తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేసినా.. హిట్ అందుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఒకవేళ సంగీత్ శోభన్ అన్నట్లు కొత్త కాన్సెప్ట్ ను తీసుకున్నా.. కథలో రిస్క్ పెంచినా రిజల్ట్ వేరేలా వస్తే ఏం చేయగలమని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి తొందరపడ్డామని మూవీ టీమ్ అనుకుంటున్నా.. ఆడియన్స్ మాత్రం సినిమాను ఆదరించారని చెబుతున్నారు. మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా నెలలు అయినా మ్యాడ్ స్క్వేర్ మూవీ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడం గమనార్హం.