తెరపై నటిగా.. పొలంలో రైతు..ఇంతకీ ఎవరా నటి?
కాలిఫోర్నియాలోని శాన్ డిగో సమీపంలోని వ్యాలీ సెంటర్ ప్రాంతంలో సుమారు 91 ఎకరాల విశాలమైన భూమిని శాండ్రా బుల్లక్ 2007 సంవత్సరంలో కొనుగోలు చేశారు.
By: Srikanth Kontham | 1 Nov 2026 1:00 AM ISTహాలీవుడ్ తెరపై అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి శాండ్రా బుల్లక్ కేవలం వెండితెర తార మాత్రమే కాదు అద్భుతమైన రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ ..ప్రకృతి ప్రేమికు రాలు కూడా. సాధారణంగా సెలబ్రిటీలు అంటే విలాసవంతమైన భవనాలు, నగర నడిబొడ్డున ప్యాలెస్‌లు ఇష్టపడతారు. కానీ శాండ్రా బుల్లక్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆలోచించారు. లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు మాత్రమే పరిమితం కాకుండా ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఎంచుకున్న విశిష్టమైన మార్గమే కాలిఫోర్నియాలోని వ్యవసాయ భూమి.
కాలిఫోర్నియాలోని శాన్ డిగో సమీపంలోని వ్యాలీ సెంటర్ ప్రాంతంలో సుమారు 91 ఎకరాల విశాలమైన భూమిని శాండ్రా బుల్లక్ 2007 సంవత్సరంలో కొనుగోలు చేశారు. అప్పట్లో దీని కోసం ఆమె 2.725 మిలియన్ డాలర్లు వెచ్చించారు. అయితే ఆ భూమిని ఫామ్‌హౌస్‌లా వదిలేయకుండా దాన్ని పూర్తి స్థాయి సేంద్రీయ వ్యవసాయ కేంద్రంగా మార్చాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అక్కడే తన అభిరుచిని.. వ్యాపార దార్శనికతను చాటుకున్నారు.
91 ఎకరాల విస్తీర్ణంలో 1,200 ఆర్గానిక్ అవకాడో చెట్లను స్వయంగా పెంచారు. రసాయన ఎరువులకు దూరంగా పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో అవకాడో తోటలను సాగు చేస్తూ వచ్చారు. వ్యవసాయం మాత్రమే కాకుండా అక్కడి పాత అడోబ్రకాల నివాస భవనాన్ని ఆధునిక హంగులతో.. పర్యావరణానికి హాని కలగని రీతిలో సుందరంగా తీర్చిదిద్దారు. స్విమ్మింగ్ పూల్, రోజ్ గార్డెన్స్, ఒలీవ్ చెట్లు , ప్రశాంతమైన వాకింగ్ ట్రైల్స్‌తో ఆ ప్రాంతాన్ని ఒక పర్ఫెక్ట్ వీకెండ్ రిట్రీట్‌గా మార్చారు.
15 ఏళ్ల పాటు వ్యవసాయాన్ని ఎంతో శ్రద్ధగా చూసుకున్న ఆమె కాలక్రమేణా ప్రాధాన్యతలు మారడంతో భారీ ప్రాపర్టీని అమ్మకానికి పెట్టారు. 2022 చివర్లో ఈ విశాలమైన ఫామ్‌హౌస్‌ను 5.6 మిలియన్ డాలర్లకు విజయవంతంగా విక్రయించారు. తాను కొనుగోలు చేసిన ధరకు రెట్టింపు కంటే ఎక్కువ లాభాన్ని ఆర్జించడమే కాకుండా గ్లామర్ లైఫ్‌కు దూరంగా సేంద్రీయ వ్యవసాయంలోనూ తాను సక్సెస్ కాగలనని నిరూపించారు. నటనతో పాటు పర్యావరణ స్పృహ, సస్టెయినబుల్ లైఫ్‌స్టైల్ పట్ల శాండ్రా బుల్లక్ చూపిన ప్రత్యేక శ్రద్ధ నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
