స్పిరిట్ సడన్ సర్ ప్రైజ్.. బట్టలూడదీసి మెడికల్ టెస్ట్ కు పంపించండి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో యాక్షన్ డ్రామా స్పిరిట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 24 Oct 2025 9:53 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో యాక్షన్ డ్రామా స్పిరిట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మాస్ ఎమోషనల్ పోలీస్ డ్రామాగా తెరకెక్కనున్న ఆ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. కెరీర్ లో తొలిసారిగా ఆయన ఖాకీ డ్రెస్ లో సందడి చేయనున్నారు.
భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న స్పిరిట్ మూవీ షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా.. చిత్రీకరణ మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇస్తూ.. సోషల్ మీడియాలో గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్.
ది సౌండ్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ స్పిరిట్ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. అందరినీ ఆకట్టుకుంటోంది. . తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చిన ఒక్క గ్లింప్స్ తోనే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మూవీలో సౌండ్ థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గ్లింప్స్ విషయానికొస్తే ఏమి చూపించలేదు.. కానీ వినిపించాడు.. పోలీస్ వెహికల్ సైరన్ మోగుతుండగా, జోరుగా వర్షం కురుస్తుంటోంది. అప్పుడే ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్న ప్రభాస్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లే సీన్స్ ను ఆడియో ద్వారా వినిపించారు. ఎవడ్రా వీడు అంటూ సూపరింటెండెంట్ గా ఉన్న ప్రకాష్ రాజ్ అడగ్గా.. న్యూ ఎంట్రీ అని, ఐపీఎస్ ఆఫీసర్ అని చెబుతారు.
ఆ తర్వాత "బ్లాక్ స్లేట్ ఇచ్చి లెఫ్ట్ రైట్ ఫోటోలు తీయండి.. వీడి గురించి విన్నాను, యూనిఫాం ఉన్నా లేకపోయినా బిహేవియర్ లో తేడా ఉండదని. టెర్నేనీట్ కూడా అయ్యాడు.. ఖైదీ యూనిఫాంలో ఎలా బిహేవ్ చేస్తాడో.. సివిలియన్ కాస్ట్యూమ్స్ నాకు నచ్చవ్. బట్టలూడదీసి మెడికల్ టెస్ట్ కు పంపించండి" అని ప్రకాష్ రాజ్ చెబుతారు.
చివర్లో ప్రభాస్.. మిస్టర్ సూపరింటెండెంట్, తనకు చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉందని చెప్పిన డైలాగ్ తో గ్లింప్స్ ముగుస్తుంది. మొత్తానికి గ్లింప్స్ లో డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సందీప్ మార్క్ క్లియర్ గా కనిపిస్తోంది. సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో కూడా క్లారిటీ వచ్చేసింది.
ఏదేమైనా ప్రభాస్ బర్త్ డే ట్రీట్ అదిరిపోగా.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక మూవీ విషయానికొస్తే... ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తున్నారు. సీనియర్ నటి కాంచన, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు.
