Begin typing your search above and press return to search.

జన'నాయకుడు' విజయ్.. విషెస్ లో కూడా వంగా మార్క్...

అయితే విజయ్ విజయంపై దేశవ్యాప్తంగా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే పోస్టులు కనిపిస్తున్నాయి.

By:  M Prashanth   |   5 May 2026 12:35 PM IST
జననాయకుడు విజయ్.. విషెస్ లో కూడా వంగా మార్క్...
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న ఆయన.. ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన పార్టీ టీవీకే.. నిన్న వచ్చిన రిజల్ట్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం 108 స్థానాల్లో విజయం సాధించడం పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ను కూడా షాక్ కు గురి చేసింది.

ఇప్పటికే కోలీవుడ్ లో ఓ రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్న విజయ్, అదే క్రేజ్‌ ను ఓట్లుగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా, కొత్త పార్టీతోనే ఇంత భారీ విజయాన్ని సాధించడం ఆయన ఫేమ్ కు బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. దీంతో ఆయనను ఇప్పుడు అభిమానులు జననాయకుడుగా పిలుచుకుంటున్నారు.

అయితే విజయ్ విజయంపై దేశవ్యాప్తంగా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే పోస్టులు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ సహా వివిధ సినీ పరిశ్రమల ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విషెస్ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఆయన తనదైన శైలిలో నెట్టింట స్పందిస్తూ, ఇది సినిమాకు ఉన్న అసలు పవర్ అని అన్నారు. సినిమా ప్రజలను కదిలించగలదని, వ్యవస్థలను ప్రభావితం చేయగలదని చెప్పారు.

ఒక సామాన్య వ్యక్తి శక్తిని నాయకత్వంగా మార్చగలదని పేర్కొన్నారు. సాధారణంగా సినిమా ఎంటర్టైన్మెంట్ కు మాత్రమే పరిమితం అవుతుందని భావించినా.. సమాజంపై దాని ప్రభావం ఎంత ఉందో విజయ్ విజయంతో మరోసారి రుజువైంది. పెద్దగా రాజకీయ ప్రచారం లేకపోయినా, గ్రౌండ్ లెవెల్ లో ప్రజల మద్దతు సాధించడం విజయ్ విజయానికి ప్రధాన కారణమని చెప్పాలి.

అదే సమయంలో తమిళనాట జరిగిన విజయ్ విక్టరీ సౌత్ ఇండియా పాలిటిక్స్ లో కొత్త ట్రెండ్‌ ను నాంది పలికిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం కొత్త విషయం కాదు. కానీ మొదటి ప్రయత్నంలోనే ఇంత భారీ విజయాన్ని అందుకోవడం మాత్రం మామూలు విషయం కాదని చెప్పాలి. అందుకే అంతా విజయ్ సక్సెస్ ను హిస్టారికల్ విక్టరీగా చెబుతున్నారు.

ఏదేమైనా ముఖ్యంగా సందీప్ వంగా వ్యాఖ్యలు వైరల్ అవుతుండడంతో, సినిమా ప్రభావం రాజకీయాలపై ఎంత ఉందన్న దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా ఒక పవర్ ఫుల్ కమ్యూనికేషన్ మీడియం అని, అది ప్రజల ఫీలింగ్స్ ఎఫెక్ట్ చేయగలదని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. విజయ్ విజయం కేవలం ఒక రాజకీయ గెలుపు మాత్రమే కాదు. సినిమా ప్రభావం ఎంత దూరం వెళ్ళగలదో చూపించిన ఉదాహరణగా నిలిచింది. ఫ్యూచర్ లో మరింత మంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడానికి ఇది మార్గం చూపించే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.