సందీప్ వంగా.. మధ్యలో మరో వర్క్?
వచ్చే నెలలో స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లతో బిజీగా ఉన్న సందీప్.. ఇప్పుడు మరో వర్క్ కూడా చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
By: M Prashanth | 31 Oct 2025 6:22 PM ISTటాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి అందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి మూవీతో డైరెక్టర్ గా మారిన ఆయన.. తక్కువ టైమ్ లోనే ఎక్కువ ఫేమ్ సంపాదించుకున్నారు. సందీప్ వంగా అంటే ఓ మార్క్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు. పాన్ ఇండియా వైడ్ గా స్పెషల్ ఫ్యాన్ బేస్ దక్కించుకున్న ఆయన.. అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.
ఇప్పటి వరకు అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలే తీసినా.. క్రేజేయెస్ట్ డైరెక్టర్ గా మారిపోయారని చెప్పాలి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయాల్సిన స్పిరిట్ మూవీ షూటింగ్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తోపాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసిన సందీప్.. లొకేషన్స్ ను ఫిక్స్ చేసిన పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే నెలలో స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లతో బిజీగా ఉన్న సందీప్.. ఇప్పుడు మరో వర్క్ కూడా చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అటు స్పిరిట్ పనులు చూస్తే.. ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం.
అందుకోసం ఇప్పుడు సందీప్ అండ్ టీమ్ వర్క్ చేస్తుందని వినికిడి. అయితే రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న మూవీతో ప్రస్తుతం బిజీగా ఉన్న మహేష్ బాబు.. ఇంకా కొన్ని నెలలపాటు ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో రానున్న ఆ చిత్రం.. భారీ రేంజ్ లో రూపొందుతోంది. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
అయితే రాజమౌళితో మహేష్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే.. సందీప్ తాను చేయాల్సిన షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారని సమాచారం. అందుకే టైమ్ ఎక్కడా వేస్ట్ అవ్వకుండా స్పిరిట్ మూవీ షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు చిత్రీకరణకు ముందు సమయం వృధా అవ్వకుండా స్టోరీని కంప్లీట్ చేస్తున్నారని వినికిడి.
రాజమౌళి- మహేష్ మూవీ పూర్తయ్యే టైమ్ కు స్పిరిట్ కూడా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. నిజానికి.. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత మహేష్ బాబును వంగా కలిశారు. కానీ అప్పుడు ఏమైందో తెలియదు. ఎలాంటి మూవీ అనౌన్స్మెంట్ రాలేదు. ఇప్పుడు మాత్రం సరైన కథ రాసుకుని మహేష్ తో చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారని టాక్. అందుకు అనుగుణంగా స్టోరీ రాసుకుంటున్నారట. మరి చూడాలి ఏం జరుగుతుందో.
