సందీప్ వంగా 'స్పిరిట్'.. అలా జరగకుండా చూసుకోవాల్సిందేనా?
ఇక అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ మూవీల తర్వాత యానిమల్ మూవీని ప్రకటించగా.. అందరి దృష్టి అటు వైపే మళ్ళింది. పీక్స్ లో అంచనాలు పెట్టుకున్నారు. అయితే యానిమల్ తో కూడా అందరినీ అలరించారు సందీప్.
By: M Prashanth | 21 Dec 2025 5:00 AM ISTటాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఇది ఒక పేరే కాదు.. బ్రాండ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైమ్ లోనే ఎక్కువ గుర్తింపు ఆయన సొంతమైంది. తెలంగాణకు చెందిన ఆయన.. కర్ణాటకలోని ధార్వాడ్ లో ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత సినిమాలు తెరకెక్కించాలనే ఆసక్తితో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశారు.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో రూపొందిన అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా రా అండ్ రస్టింగ్ స్టోరీ టెల్లింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు సందీప్. ఓ రేంజ్ లో మూవీని రూపొందించి అందరినీ ఫుల్ గా ఆకట్టుకున్నారు.
అర్జున్ రెడ్డి తర్వాత ఆ సినిమానే రీమేక్ చేసి హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించిన ఆయన.. అక్కడ కూడా భారీ హిట్ అందుకున్నారు. మూవీలో లీడ్ రోల్ లో నటించిన షాహిద్ కపూర్ కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. బాలీవుడ్ మూవీ లవర్స్ కు తెగ నచ్చేసింది. సందీప్ వంగా టాలెంట్ కు అంతా ఫిదా అయ్యారు. అనేక మంది నార్త్ ఆడియన్స్.. ఆయనకు ఫ్యాన్స్ గా మారిపోయారు కూడా.
ఇక అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ మూవీల తర్వాత యానిమల్ మూవీని ప్రకటించగా.. అందరి దృష్టి అటు వైపే మళ్ళింది. పీక్స్ లో అంచనాలు పెట్టుకున్నారు. అయితే యానిమల్ తో కూడా అందరినీ అలరించారు సందీప్. సినిమాలో కొన్ని అంశాలకు అనేక విమర్శలు వచ్చినా.. ఎక్కడా అదరలేదు.. బెదరలేదు. సరైన కౌంటర్స్ ఇస్తూ ముందుకు సాగారు. హిట్ ట్రాక్ ను కొనసాగిస్తూ ముందుకు వెళ్లారు.
అయితే ఇప్పుడు స్పిరిట్ మూవీతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాస్ యాక్షన్ డ్రామాగా రానున్న ఆ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పిరిట్ లో చాలా అంటే.. చాలా వయొలెన్స్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. దీంతో సినిమాను ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు అభిమానులు, సినీ ప్రియులు.
అదే సమయంలో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోవాల్సిన అవసరం సందీప్ కు ఉంది. ముఖ్యంగా వయొలెన్స్ ఎక్కువని ముందు నుంచి చెబుతున్నారు. అదే శృతిమించితే విమర్శలు తప్పవు. కచ్చితంగా విమర్శలు వస్తాయి. దీంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అటు తన స్టైల్ లో మూవీ తీస్తూనే.. ఇటు ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని మూవీ రూపొందించాల్సిందే.
అయితే రీసెంట్ గా నందమూరి బాలయ్యతో బోయపాటి శ్రీను అఖండ-2 తీసిన విషయం తెలిసిందే. ఫ్యాన్స్ కు సినిమా నచ్చినా.. కొన్ని అంశాల విషయంలో నార్మల్ ఆడియన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. వారు భారీ అంచనాలు పెట్టుకున్నా.. టేకింగ్ స్టైల్ విషయంపై ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు అలాంటి పరిస్థితి.. సందీప్ కు స్పిరిట్ తో ఎదురవ్వకుండా చూసుకోవాలి.
దానికి తోడు స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, ప్రశాంత్ నీల్ తో కంపేరిజన్స్ కూడా వస్తాయి. ఇప్పటి వరకు ఫెయిల్యూర్ ఎరుగని జక్కన్న.. ఆడియన్స్ పల్స్ పై ఫోకస్ చేసి సినిమాలు చేస్తూనే ఉన్నారు. తన మేకింగ్ స్టైల్ లో ఎక్కడా తేడా కొట్టకుండా ఎంతో జాగ్రత్త చూసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ కూడా అదే వేలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సందీప్ వంగా.. స్పిరిట్ కు గాను సరైన ప్లాన్ తో ముందుకు వెళ్లాలి. ఆడియన్స్ అంచనాలను అందుకునేలా ఉండాలి. అలా అనే విమర్శలు ఎదుర్కోకుండా ఉండాలి. దీంతో మరేం జరుగుతుందో వేచి చూడాలి.
