Begin typing your search above and press return to search.

సందీప్ వంగకు, ఆ సినిమాకు సంబంధమేంటి?

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల లిస్టు తీస్తే టాప్-5లో ఉండే పేరు.. సందీప్ రెడ్డి వంగ.

By:  Garuda Media   |   7 Aug 2026 11:00 PM IST
సందీప్ వంగకు, ఆ సినిమాకు సంబంధమేంటి?
X

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల లిస్టు తీస్తే టాప్-5లో ఉండే పేరు.. సందీప్ రెడ్డి వంగ. చాలా తక్కువ టైంలో చాలా పెద్ద రేంజికి ఎదిగిపోయాడతను. యూత్‌లో అతడికున్న ఫాలోయింగ్ అలాంటిలాంటిది కాదు. కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ దర్శకుడిని కొన్ని విషయాల్లో వ్యతిరేకించే వాళ్లూ ఉన్నారు. తన కథల్లో పురుషాధిక్యత కనిపిస్తుందని.. మహిళల మీద హింసను ప్రేరేపించేలా సినిమాలు తీస్తాడని.. యువతను పెడదోవ పట్టించేలా సన్నివేశాలుంటాయని.. ఇలా విమర్శలైతే చాలానే ఉన్నాయి.

ఐతే ఇలా తనను విమర్శించేవారికి గట్టిగానే సమాధానం ఇస్తుంటాడు సందీప్. ఆ సంగతి పక్కన పెడితే.. యంగ్ ఫిలిం మేకర్స్‌కు.. అలాగే తనకు పరిచయం ఉన్న ఇండస్ట్రీ జనాలకు అతను ఇచ్చే ప్రోత్సాహం అభినందనీయం. తన రేంజ్ ఏంటన్నది చూసుకోకుండా చిన్న సినిమాలకు అండగా నిలుస్తుంటాడు. ఇప్పుడు ‘కేజీక్యూ’ చిత్రానికి కూడా అతను సపోర్ట్ చేస్తున్నాడు. ఐతే వేరే చిత్రాల మాదిరి ఏదో ఒక ఈవెంట్‌కు వచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోవడం కాదు.. ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేసిన ముగ్గురితో కలిసి సందీప్ ఒక ఇంటర్వ్యూ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సందీప్ ఈ సినిమాకు సపోర్ట్ చేయడాన్ని గురుదక్షిణగా భావిస్తున్నారు. ఈ సినిమా తీసిన కేకే అలియాస్ కిరణ్.. కొన్ని నెలల ముందు అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. అతను సందీప్‌కు గురువు కాని గురువు కావడం విశేషం. దర్శకుడిగా కిరణ్‌ది పెద్ద కెరీర్ ఏమీ కాదు. తనకు అంత గొప్ప పేరు కూడా లేదు. కానీ డిజాస్టర్ అయిన తన తొలి చిత్రం ‘కేడి’కి సందీప్ రెడ్డి దర్శకత్వ విభాగంలో పని చేశాడు. ఆ చిత్రంలో సందీప్ చిన్న పాత్ర కూడా చేసిన సంగతి చాలామందికి తెలియదు. ‘కేడి’ సినిమాను జాగ్రత్తగా గమనిస్తే ఒక చోట సందీప్‌ను గుర్తు పట్టొచ్చు.

ఐతే ఆ సినిమా నిరాశపరచడంతో కిరణ్ కనిపించకుండా పోయాడు. మళ్లీ చాలా ఏళ్లకు కేకేగా పేరు మార్చుకుని ‘కేజేక్యూ’ సినిమా తీశాడు. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమా విడుదలకు కొన్ని నెలల ముందు అనారోగ్యంతో చనిపోయాడు. ‘కేడి’ తర్వాత చాలా ఏళ్లకు ‘అర్జున్ రెడ్డి’తో దర్శకుడిగా మారి సంచలనం రేపిన సందీప్... ఇప్పుడు ఇండియాలోనే అతి పెద్ద దర్శకుల్లో ఒకడిగా ఎదిగాడు. తన ముందు కిరణ్ అనే దర్శకుడి స్థాయి చాలా తక్కువే. కానీ ఒకప్పుడు సందీప్‌కు అవకాశమిచ్చి ప్రోత్సహించాడు. ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు సందీప్ గతంలో తన గురువు స్థానంలో ఉన్న కిరణ్ కోసం తన మరణానంతం అతడి చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చాడు. ఇలా ఒక వ్యక్తి చేసిన సాయాన్ని గుర్తుంచుకుని తన మరణానంతరం ఇలా కృతజ్ఞత చూపించే సందీప్ లాంటి వ్యక్తులు అరుదే.