యానిమల్ 2లో టాలీవుడ్ స్టార్..?
ప్రభాస్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం ఆరు నెలల్లో సినిమా రెడీ చేసేలా ఉన్నాడు సందీప్. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఎలాగైనా ఈ సినిమా రిలీజ్ చేసే ప్లానింగ్ ఉందట.
By: Ramesh Boddu | 28 Sept 2025 10:41 AM ISTయానిమల్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న సందీప్ వంగ నెక్స్ట్ స్పిరిట్ ని పట్టాలెక్కించబోతున్నాడు. ఐతే ఆ సినిమాతో పాటు సందీప్ వంగ యానిమల్ పార్ట్ 2 గురించి కూడా డిస్కషన్ నడుస్తుంది. రణ్ బీర్ కపూర్ కి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన సందీప్ వంగ నెక్స్ట్ యానిమల్ పార్క్ తో కూడా అదరగొట్టే ప్లాన్ లో ఉన్నాడు. ఐతే యానిమల్ సినిమా తర్వాత స్పిరిట్ తో మరో భారీ సినిమాతో వస్తున్న సందీప్ వంగ యానిమల్ పార్క్ గురించి కూడా తన టీం తో డిస్కస్ చేస్తున్నాడట. ఐతే యానిమల్ 2 లో ఒక ఇంపార్టెంట్ అండ్ పవర్ ఫుల్ రోల్ ఉందట.
యానిమల్ 2లో టాలీవుడ్ స్టార్ హడావిడి..
ఆ రోల్ లో టాలీవుడ్ స్టార్ ని తీసుకోవాలనే ప్లానింగ్ లో ఉన్నాడట సందీప్ వంగ. యానిమల్ 2లో నటించే ఆ టాలీవుడ్ స్టార్ ఎవరన్న హడావిడి మొదలైంది. ఐతే దానికి ఇంకా టైం ఉంది. ముందు సందీప్ వంగ ప్రభాస్ తో చేయాల్సిన స్పిరిట్ సినిమా పూర్తి కావాలి. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైంది. మ్యూజిక్ కూడా 70 శాతం ఆర్.ఆర్ కూడా పూర్తి చేశాడట. సందీప్ వంగ సినిమా అంటే స్పీడ్ వర్క్ ఉంటుంది.
ప్రభాస్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం ఆరు నెలల్లో సినిమా రెడీ చేసేలా ఉన్నాడు సందీప్. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఎలాగైనా ఈ సినిమా రిలీజ్ చేసే ప్లానింగ్ ఉందట. ఐతే ప్రభాస్ స్పిరిట్ కి కావాల్సినన్ని డేట్స్ ఇవ్వాలి. సందీప్ వంగ సినిమాల్లో వి.ఎఫ్.ఎక్స్, సీజీ వర్క్ తక్కువగా ఉంటుంది. సో సినిమా లేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. స్పిరిట్ పూర్తి చేసిన తర్వాత యానిమల్ పార్క్ గురించి పనులు మొదలవుతాయి.
సందీప్ వంగ పెద్ద స్కెచ్..
ఐతే ఎప్పుడొచ్చినా సరే యానిమల్ 2 లో నటించే టాలీవుడ్ యాక్టర్ ఎవరు అన్నది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. సందీప్ వంగ యానిమల్ పార్క్ తో ఈసారి చాలా పెద్ద స్కెచ్ వేసినట్టు అర్ధమవుతుంది. మరి యానిమల్ పార్క్ ని క్రేజీ మల్టీస్టారర్ సినిమాగా చేస్తాడా ఏంటంటూ ఆడియన్స్ డిస్కస్ చేస్తున్నారు.
సందీప్ వంగ సినిమా అంటే ఏ హీరో అయినా నో చెప్పే ఛాన్స్ లేదు. తప్పకుండా రణ్ బీర్ తో పాటు నటించే తెలుగు స్టార్ ఎవరైనా ఈ కాంబో మరో సెన్సేషన్ గా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఐతే ఆ డీటైల్స్ రావాలంటే మాత్రం ఇంకాస్త టైం వెయిట్ చేయక తప్పదు.
