మహేష్.. వైలెంట్ యాంగిల్ లో కనిపించాలంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఏఐ వీడియో ఇప్పుడు నెట్టింట మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయడం లేదు.
By: M Prashanth | 10 Aug 2026 6:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఏఐ వీడియో ఇప్పుడు నెట్టింట మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయడం లేదు. లెజెండరీ నటుడు కృష్ణ గారు చెప్పిన ఒక ఫేమస్ డైలాగ్ కి, మహేష్ బాబు వాయిస్ ని యాడ్ చేసి, దానికి తోడు ఒక డార్క్ మాస్ లుక్ ని సెట్ చేసి సందీప్ వదిలిన ఆ చిన్న క్లిప్ అభిమానులకు ఒక రేంజ్ కిక్ ఇచ్చింది.
ఆ ఏఐ క్రియేటెడ్ వీడియోలో మహేష్ కిరాయి కోటిగాడు స్టైల్ లో సిగరెట్ తాగుతూ ఒక రఫ్ అండ్ రా లుక్ లో కనిపించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. చాలా కాలంగా మహేష్ కేవలం క్లాస్, సాఫ్ట్ మెసేజ్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ కే ఎక్కువగా పరిమితం అయ్యాడనే ఒక ఫీలింగ్ ప్రతి అభిమానిలోనూ ఉంది. రాజమౌళి వారణాసి లో మాస్ యాంగిల్ ఉంటుంది కానీ ఆ కాన్సెప్ట్ వేరు. కాబట్టి మాస్ జాతర హై రేంజ్ లో ఉండకపోవచ్చు.
ఇక వంగా ఇచ్చిన శాంపిల్ తో ఫ్యాన్స్ లో ఒక హైప్ క్రియేట్ అవుతోంది. మహేష్ లో దాగి ఉన్న ఆ వైలెంట్ మాస్ యాంగిల్ ని బయటకు తీసి, దాన్ని కేవలం సందీప్ రెడ్డి వంగా మాత్రమే పర్ఫెక్ట్ గా వాడుకోగలడు అని సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో క్యారెక్టరైజేషన్ ని చాలా డార్క్ గా, ఇంటెన్స్ గా ప్రెజెంట్ చేయడంలో సందీప్ కు ఉన్న స్పెషాలిటీ గురించి దేశవ్యాప్తంగా సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.
గతంలో వీళ్లిద్దరి కాంబోలో 'డెవిల్' అనే ఒక పవర్ ఫుల్ ప్రాజెక్ట్ వస్తుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఈ ఏఐ వీడియో చూశాక, ఆ ఆగిపోయిన డెవిల్ ప్రాజెక్ట్ కి సందీప్ మళ్ళీ ప్రాణం పోసే ఉద్దేశంతోనే ఇలాంటి ఒక హింట్ ఇచ్చాడా అనే అనుమానాలు కూడా నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి. ఒక రూత్ లెస్ రోల్ లో మహేష్ ని స్క్రీన్ మీద చూడాలనే కోరిక ఫ్యాన్స్ లో మరోసారి బలంగా నాటుకుపోయింది.
అయితే ఫ్యాన్స్ ఎంతగా ఈ ప్రాజెక్ట్ ని కోరుకుంటున్నా, ఈ క్రేజీ కాంబోకి సంబంధించి అఫీషియల్ గా ఇంకా ఎలాంటి డెసిషన్ జరగలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడా ఫిక్స్ కాలేదు అనేది వాస్తవం. ప్రస్తుతం సందీప్ తన నెక్స్ట్ కమిట్మెంట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు వేరే డైవర్షన్ ఉండదు.
అయితే ఈ చిన్న క్లిప్ పుణ్యమా అని వారణాసి ప్రాజెక్ట్ కన్నా దీని మీదే నెట్టింట ఎక్కువ కామెంట్స్ పడుతున్నాయి. భవిష్యత్తులో గనక నిజంగానే ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ రావడం గ్యారెంటీ. మరి ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్న ఆ వయోలెంట్ మాస్ మ్యాజిక్ ఎప్పటికి సాకారమవుతుందో చూడాలి.
