ఒక్క మెసేజ్ తో ఐదున్నర లక్షలు ఇచ్చిన సందీప్.. విస్తుపోయే నిజాలు చెప్పిన హీరోయిన్!
అలాగే తనకి కొన్ని ప్రాజెక్టులు కూడా అప్పజెప్పాడని, కానీ ఓ ప్రాజెక్టు చేసే సమయంలో డైరెక్టర్ ప్రవర్తన నచ్చక.. నేను దాన్ని రిజెక్ట్ చేశానంటూ గాయత్రి గుప్తా చెప్పుకొచ్చింది.
By: Madhu Reddy | 10 Aug 2025 3:57 PM ISTఇండియన్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు. ఈయన తీసిన అర్జున్ రెడ్డి , యానిమల్ వంటి సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి క్రేజ్ ఇండియా వ్యాప్తంగా వ్యాపించింది. అయితే అలాంటి సందీప్ రెడ్డి వంగా కేవలం సినిమాలు మాత్రమే కాదు సహాయం చేయడంలోనూ ముందే ఉంటారు. దానికి ఉదాహరణగా ఈ నటికి చేసిన సాయాన్ని చెప్పుకోవచ్చు. డబ్బులు లేక ఆరోగ్యం బాగోలేక డౌన్ లో ఉన్న స్టేజ్ లో ఉన్న ఫిదా బ్యూటీకి సందీప్ రెడ్డి వంగా డబ్బు సాయం చేసారు అని తెలుస్తుంది. మరి ఇంతకీ ఆ నటి ఎవరో కాదు ఫిదా మూవీలో సాయి పల్లవి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన గాయత్రి గుప్తా.. బిగ్ బాస్ వివాదం ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన గాయత్రి గుప్తా.. ఆ మధ్యకాలంలో తాను ఎక్కువ రోజులు బ్రతకనంటూ మాట్లాడిన సంగతి తెలిసిందే.
ఆమెకు ఉన్న వ్యాధి కారణంగా చనిపోయే స్టేజ్ కి వెళ్ళిందట.ఆ సమయంలో గాయత్రి గుప్తా సందీప్ రెడ్డి వంగాకు ఒక పెద్ద మెసేజ్ పెట్టి.. నాకు ఇంత డబ్బు సాయం కావాలి అని మెన్షన్ చేసిందట. దాంతో గాయత్రి పెట్టిన మెసేజ్ చూసిన సందీప్ రెడ్డి నీకు సంబంధించిన హాస్పిటల్ పేపర్స్ అన్నీ పంపించమని చెప్పడంతో గాయత్రి వాటన్నిటిని సందీప్ కి షేర్ చేసిందట. ఇక అవన్నీ చూసిన సందీప్ రెడ్డి కేవలం 1 వీక్ లోనే గాయత్రి అకౌంట్లో 5,50,000 వేశారట. ఈ విషయం గురించి తాజాగా గాయత్రి గుప్తా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "అసలు ఇప్పటివరకు సందీప్ ని సరిగ్గా కలిసింది కూడా లేదు. కానీ సందీప్ నాకున్న వ్యాధి గురించి చెప్పిన 1 వీక్ లోనే రూ.5,50,000 వేశారు. అయితే ఫిదా మూవీ చూసి నీ యాక్టింగ్ బాగుందని ఫేస్ బుక్ లో కామెంట్ చేశారు. ఆ తర్వాత నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. అలా మా మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆయన పంపిన డబ్బులతో నేను ట్రీట్మెంట్ చేయించుకొని బతికి బయటపడ్డాను. నిజంగా ఆయన చాలా గ్రేట్ అంటూ పొగిడింది.
అలాగే తనకి కొన్ని ప్రాజెక్టులు కూడా అప్పజెప్పాడని, కానీ ఓ ప్రాజెక్టు చేసే సమయంలో డైరెక్టర్ ప్రవర్తన నచ్చక.. నేను దాన్ని రిజెక్ట్ చేశానంటూ గాయత్రి గుప్తా చెప్పుకొచ్చింది. అలాగే తన హెల్త్ గురించి మాట్లాడుతూ.. "నేను ఇంట్లో, బయట చాలామందితో సఫర్ అయ్యాను. నటించే వారందరినీ దూరం పెట్టాలని నిర్ణయించుకున్నాక.. నా లైఫ్ లో 90% మెంబర్స్ నాకు దూరం అయ్యారు. వారితో రిలేషన్ కట్ చేసుకున్నాను. కేవలం నా లైఫ్ లో నలుగురు మాత్రమే ఉన్నారు.. నేను యోగా,మెడిటేషన్, ప్రాణాయామం వంటివి చేస్తూ మళ్లీ నార్మల్ గా అయ్యాను.
పంచకర్మ చేసినప్పటినుండి నా మైండ్ చాలా రిఫ్రెష్ అయింది. నా మైండ్ లో ఉన్న వేస్టేజ్ మొత్తం బయటికి పంపించేసి రిలీఫ్ అయ్యాను.ఆ టైంలో డాక్టర్లు కూడా నన్ను చూసి చచ్చిపోతావని చెప్పారు. మెంటల్ గా చాలా సఫర్ అయ్యాను. కానీ సందీప్ చేసిన హెల్ప్ తో నేను మళ్ళీ బతికాను. హమ్మయ్యా నేను ఇక లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను అంటూ తన హెల్త్ గురించి అలాగే సందీప్ రెడ్డి వంగా చేసిన సాయం గురించి, ఆయనతో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నటి గాయత్రి గుప్తా.
