Begin typing your search above and press return to search.

స్పిరిట్ రిలీజ్ డేట్ లాక్.. సందీప్ దూకుడు మామూలుగా లేదుగా!

సాధారణంగా సందీప్ రెడ్డి వంగ సినిమాలు అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

By:  Madhu Reddy   |   17 Jan 2026 12:58 AM IST
స్పిరిట్ రిలీజ్ డేట్ లాక్.. సందీప్ దూకుడు మామూలుగా లేదుగా!
X

సాధారణంగా సందీప్ రెడ్డి వంగ సినిమాలు అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా ప్రకటించడమే కాకుండా.. ఆయనను తొలిసారి మునుపెన్నడూ చూడని ఆజానుభావు లుక్ లో చూపించి అందరిని ఆశ్చర్యపరిచారు. అలాంటి ఈయన ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. సాధారణంగా ఏ దర్శకుడైన సరే దాదాపు షూటింగ్ పూర్తి అయిన తర్వాతనే తమ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ ఉంటారు. అలాంటిది షూటింగ్ ఇంకా మొదలుపెట్టి కొన్ని రోజులే అయింది అప్పుడే సందీప్ తన సినిమా విడుదల తేదీని లాక్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.




ఇక విషయంలోకి వెళ్తే.. సంక్రాంతి సందర్భంగా కనుమ పండుగను పురస్కరించుకుని ప్రభాస్ 25వ చిత్రం స్పిరిట్ సినిమా విడుదల తేదీని డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ప్రకటించారు .భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన థియేటర్లలోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో కొత్త ఒరవడి సృష్టించిన సందీప్ రెడ్డివంగా.. ఈసారి రెబల్ స్టార్ 25వ సినిమాతో మరో సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నారు. భారీ యాక్షన్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి.

ఇటు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ అటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి అని చెప్పవచ్చు. పైగా ఈ చిత్రాన్ని మొత్తం ఎనిమిది భాషలలో విడుదల చేయబోతున్నారు. . ఇకపోతే ప్రభాస్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.. ఆయనకు జోడిగా ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాను మార్చి 5వ తేదీ విడుదల చేయడానికి గల కారణం తెలిసి అభిమానులు కూడా సందీప్ రెడ్డి వంగ టాలెంట్ కి ఫిదా అవుతున్నారు. విషయంలోకి వెళ్తే మార్చి 5వ తేదీ ఫ్రైడే.. ఆరోజు ఈ సినిమా విడుదల కానుంది. మార్చి 6న మహాశివరాత్రి పైగా శనివారం సెలవు. మార్చి 7వ తేదీన ఆదివారం. ఇక మార్చి 9వ తేదీన ఈద్ ఫెస్టివల్ ఉండడంతో ఐదు రోజులపాటు లాంగ్ వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావించి ఈ డేట్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ , కాంచన వంటి సెలెబ్రిటీలు కీలకపాత్రను పోషిస్తుండగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

అలాగే భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలతో పాటు చైనీస్, కొరియన్, జపనీస్ ఇలా మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు సందీప్. మరి ఇన్ని భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.