స్పిరిట్.. నిజంగా ఈ టెక్నాలజీ వాడి ఉంటే ట్రెండ్ సెట్ చేసినట్లే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మాస్ యాక్షన్ పోలీస్ డ్రామా స్పిరిట్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 24 Oct 2025 3:36 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మాస్ యాక్షన్ పోలీస్ డ్రామా స్పిరిట్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వగా.. మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే అనౌన్స్మెంట్ నుంచే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలా ఉంటుందోనని వెయిట్ చేస్తున్నారు సినీ ప్రియులు, అభిమానులు. ఇప్పటికే ఇంటర్వ్యూల్లో పలు అప్డేట్స్ ఇచ్చిన సందీప్ వంగా.. రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సౌండ్ స్టోరీ పేరుతో ఆడియో గ్లింప్స్ ను లేట్ నైట్ లో విడుదల చేశారు.
జైలు సూపరింటెండెంట్ గా ప్రకాష్ రాజ్.. ఐపీఎస్ అధికారిగా ప్రభాస్ మధ్య కన్వర్జేషన్ ఆడియోను గ్లింప్స్ రూపంలో తీసుకొచ్చారు. మూడు, నాలుగు డైలాగ్స్ ఉన్న సౌండ్ స్టోరీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది. ఆడియో గ్లింప్స్ అదిరిపోయిందని నెటిజన్లు, సినీ ప్రియులు చెబుతున్నారు.
అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో సౌండ్ స్టోరీకి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ ఆడియో గ్లింప్స్ ను ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశారని టాక్ వినిపిస్తోంది. పప్పు అనే ఇంజనీర్ ఆ డబ్బింగ్ సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేశారని.. దాని ద్వారానే ఇప్పుడు స్పిరిట్ మేకర్స్ క్రియేట్ చేశారని తెలుస్తోంది.
స్టూడియోకు వెళ్లి రికార్డు చేయకుండా.. ప్రకాష్ రాజ్, ప్రభాస్ వాయిస్ లను ఏఐ ద్వారా క్రియేట్ చేశారని సమాచారం. ఇప్పటికే పలు సినిమాలకు ఆ సాఫ్ట్ వేర్ ను యూజ్ చేయగా.. ఇప్పుడు స్పిరిట్ ఆడియో గ్లింప్స్ కు అదే వినియోగించారని తెలుస్తోంది. ప్రభాస్ కు ముందే సందీప్ రెడ్డి వంగా ఆ విషయాన్ని చెప్పారని వినికిడి.
నిజానికి.. కొద్ది రోజుల క్రితమే ఆడియో గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని సందీప్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అందుకే రికార్డింగ్ కోసం క్యాస్టింగ్ ను పిలవకుండా.. ఏఐ డబ్బింగ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించారని సమాచారం. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఏంటి నిజమేనా.. ఏఐతోనే క్రియేట్ చేశారా అని అంటూ షాక్ అవుతున్నారు.
