ఆ కటౌట్ కి తగ్గ క్యారెక్టర్ పడుతుందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే, ప్రతీ సినిమా ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ జానర్స్‌లో ఉన్నాయి.
By: M Prashanth | 3 Nov 2025 11:08 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే, ప్రతీ సినిమా ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ జానర్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే కల్కిలో కర్ణడిగా కాస్త సర్ ప్రైజ్ చేసి సలర్ లో హై వోల్టేజ్ గా కనిపించాడు. ఇక రాజా సాబ్ (హారర్ కామెడీ), 'ఫౌజీ' (రొమాంటిక్ వార్ డ్రామా).. లైన్ గా వేటికవే భిన్నంగా ఉన్నాయి. కానీ, ఫ్యాన్స్‌కు మాత్రం ఏదో ఒక వెలితి. రీసెంట్‌గా 'బాహుబలి: ది ఎపిక్' రీ రిలీజ్ చూశాక ఆ వెలితి ఏంటో అందరికీ మళ్లీ గుర్తొచ్చింది. అదే ప్రభాస్‌లోని 'ఫైర్'.
'బాహుబలి' తర్వాత ప్రభాస్ చాలా సినిమాలు చేసినా, ఆ సినిమాల్లోని క్యారెక్టర్లు చాలా వరకు సాఫ్ట్‌గా, 'డార్లింగ్' ఇమేజ్‌కు దగ్గరగా ఉన్నాయి. సలార్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఉన్నా ఏమోషన్ మిస్సయ్యింది. కానీ ఫ్యాన్స్ మిస్ అవుతున్నది ఆ 'కటౌట్'కు తగ్గ కసి, ఆ 'రెబెల్ స్టార్' అనే బిరుదుకు న్యాయం చేసే ఇంటెన్సిటనీ అలాగే హై వోల్టేక్ ఎమోషన్ ని. ఈమధ్య కాలంలో ఏ క్యారెక్టర్ కూడా ఆ ఆకలిని పూర్తిగా తీర్చలేకపోయాయి.
ఇప్పుడు, ఆ ఆకలిని తీర్చడానికే, ప్రభాస్‌లోని ఆ 'బీస్ట్'ను నిద్రలేపడానికి సరైన డైరెక్టర్ దొరికాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలతో ఇండస్ట్రీ రూల్స్ మార్చేసిన సందీప్ రెడ్డి వంగా. సందీప్ హీరోలు చాలా బోల్డ్‌గా, మొహమాటం లేకుండా, పూర్తి రా..గా, వయొలెంట్‌గా ఉంటారు. ఇప్పుడు అలాంటి డైరెక్టర్ చేతిలో, ప్రభాస్ లాంటి భారీ కటౌట్ పడితే ఎలా ఉంటుందన్న ఊహే ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
సందీప్, ప్రభాస్‌తో తీస్తున్న 'స్పిరిట్' సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే, ఇది రొటీన్ సినిమా కాదని ఫిక్స్ అయిపోయారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, సందీప్ ఈ సినిమాతో 'రెబెల్ స్టార్' అనే పదానికి అసలైన అర్థం చూపించబోతున్నాడట. ఇది ఒక ఎమోషనల్ వైల్డ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. రీసెంట్‌గా రిలీజ్ వాయిస్ ఆడియో టీజర్ కూడా ఆ వైల్డ్ మూడ్‌ను కన్వే చేసింది.
ప్రభాస్‌కు ఉన్న సాఫ్ట్ ఇమేజ్‌ను బ్రేక్ చేసి, 'స్పిరిట్'తో అతని ఇమేజ్‌ను పూర్తిగా హైలెట్ చేయాలని సందీప్ ప్లాన్. ఇది చాలా పెద్ద ఛాలెంజ్. 'యానిమల్'లో రణబీర్‌ను చూసి షాక్ అయిన ఆడియెన్స్, ఇప్పుడు ప్రభాస్‌ను ఇంత ఫెరోషియస్ అవతార్‌లో చూసి తట్టుకోగలరా? అనేది పెద్ద ప్రశ్న. కానీ, సందీప్ ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ చాలా బలంగా ఉంటుందని, అది హీరో క్యారెక్టర్‌ను జస్టిఫై చేస్తుందని అంటున్నారు. మొత్తానికి, 'రాజా సాబ్', 'ఫౌజీ' ఉన్నా, 2027లో రానున్న 'స్పిరిట్' కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటించనున్న విషయం తెలిసిందే. ఇక 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌లో మిస్సయిన ఆ స్పార్క్‌ను సందీప్ వంగా తిరిగి రగిలిస్తే, పాన్ ఇండియా బాక్సాఫీస్ మరోసారి షేక్ అవ్వడం ఖాయం.
