Begin typing your search above and press return to search.

మహేష్ × వంగా.. ప్లాన్ సెట్టయ్యేలా ఉందే..

ప్రస్తుతం అదే తరహాలో హాట్ టాపిక్‌గా మారుతోంది మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్. ఈ కాంబినేషన్ పై గాసిప్స్ కొత్త కాదు.

By:  M Prashanth   |   18 Sept 2025 12:08 PM IST
మహేష్ × వంగా.. ప్లాన్ సెట్టయ్యేలా ఉందే..
X

టాలీవుడ్ లో స్టార్ హీరోల కొత్త కాంబినేషన్స్ ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ గా మారుతుంటాయి. చిన్న లీక్ వచ్చినా అభిమానుల ఊహాగానాలు, ట్రేడ్ సర్కిల్స్ అంచనాలు కొత్త ఎత్తులకు చేరతాయి. ప్రస్తుతం అదే తరహాలో హాట్ టాపిక్‌గా మారుతోంది మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్. ఈ కాంబినేషన్ పై గాసిప్స్ కొత్త కాదు.

‘అర్జున్ రెడ్డి’ తర్వాతే ఈ కాంబోపై చర్చలు జరిగాయి. కానీ ఆ సమయంలో మహేష్ రిస్క్ చేయాలని అనుకోలేదు. అలాగే ఆ మధ్య ‘యానిమల్’ ప్రమోషన్స్ లో సందీప్ ని అడిగినప్పుడు, “మహేష్ కోసం మరింత వైలెంట్ కథ రెడీగా ఉంది” అని ఆయన చెప్పిన మాటలు కొత్త ఊహాగానాలకు దారితీశాయి. ఈ కాంబో ఒకవేళ నిజమైతే టాలీవుడ్ కి మరో పెద్ద సెన్సేషన్ అవుతుంది అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

ఇక ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లడంలో మహేష్ భాగస్వామి అయిన ఏషియన్ సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. AMB సినిమాస్ లో మహేష్ తో భాగస్వామి అయిన సునీల్ కి సందీప్ ఇప్పటికే ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. దానిని మహేష్ కోసం ఫైనల్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ముందుకొచ్చారని వార్తలు వస్తున్నాయి. భారీ ఆఫర్ తో వాళ్లు కూడా ఈ సినిమా కోసం ప్రయత్నిస్తున్నారట.

అయితే, ప్రస్తుతానికి మహేష్ బాబు ఫోకస్ రాజమౌళి ప్రాజెక్ట్ మీదే ఉంది. SSMB29 గా వస్తున్న ఆ సినిమా 2027లో రిలీజ్ కానుంది. కాబట్టి ఆ సినిమా పూర్తయ్యే వరకు మహేష్ కొత్త ప్రాజెక్ట్ లపై అప్డేట్ ఇవ్వడం జరగదని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ కాంబినేషన్ సైలెంట్ గానే సెట్టయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ తో చేయబోతున్న స్పిరిట్ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్, యానిమాల్ 2 లైన్ లో ఉన్నాయి. కాబట్టి తదుపరి ప్రాజెక్ట్ పై ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సి ఉంది. ఏదేమైనా మహేష్ తో సినిమా జరిగితే టాలీవుడ్ బాక్సాఫీస్ మరోసారి కుదిపేస్తుందని ట్రేడ్ అంచనా. టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా స్థాయిలో కూడా పెద్ద ప్రాజెక్ట్ గా నిలిచే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం ఆ రోజు త్వరగా రావాలని ఎదురుచూస్తున్నారు.