సందీప్ మూవీలో హీరో క్యారెక్టర్ కి ఉండే మైనస్ అదే... స్పిరిట్ లో కూడా రిపీట్ అవుతుందా...
'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా... ఈ సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి ఆయన పేరు ఇండియా వైడ్ గా మారుమ్రోగిపోతుంది.
By: Gopi Velupala | 5 Oct 2026 9:42 AM IST'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా... ఈ సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి ఆయన పేరు ఇండియా వైడ్ గా మారుమ్రోగిపోతుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి మూవీని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో చేసి సూపర్ సక్సెస్ ను సాధించాడు. అలాగే రన్బీర్ కపూర్ ను హీరోగా పెట్టి 'అనిమల్' సినిమా చేసి ప్రేక్షకుల అటెన్షన్ ను తన వైపు తిప్పుకున్నాడు. ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. కారణమేంటంటే తన సినిమాల్లో ఒక ప్యూర్ ఎమోషన్ ఉంటుంది. దాని మీద స్టిక్ ఆన్ అయిపోయి ఆయన సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. సందీప్ రెడ్డివంగా సినిమాల్లోని హీరోకి కొన్ని మైనస్ లు ఉంటాయి. అవేంటంటే వాళ్లకు విపరీతమైన కోపం ఉంటుంది. ఎవరిని లెక్క చేయని స్వభావం ఉంటుంది. తాము అనుకున్న ఏదైతే అనుకుంటారో దానిమీద నిలబడి ఉంటారు. కాబట్టి మేము ఎలాంటి తప్పు చేయము అనే ఒక గర్వం అయితే వాళ్ళ క్యారెక్టర్ లో కనిపిస్తుంది... అర్జున్ రెడ్డి, అనిమల్ తో పాటు ఇప్పుడొస్తున్నా 'స్పిరిట్' సినిమాలో సైతం ప్రభాస్ కూడా ఇలాంటి లక్షణాలతోనే కనిపిస్తారట. ఏది ఏమైనా కూడా ఇపుడున్న యూత్ సందీప్ రెడ్డి వంగ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఒక మనిషిలోని ప్లస్ లు, మైనస్ లు రెండు చూపించినప్పుడే తనలోని పూర్తి ఎమోషన్ బయటపడుతుంది. ఆ క్యారెక్టర్ ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో అంటే కేవలం రాముడు మంచి బాలుడు అనే లైన్ లోనే పెట్టి సినిమాలను చేస్తున్నారు.
హీరో అంటే అతనికి ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు. ఆయన ఎప్పుడు చెడు పనులు చేయకూడదనే ధోరణిలోనే ఉన్నారు. కానీ అలాంటి ఆలోచనలతో ఉన్న వారందరికి బ్రెయిన్ వాష్ చేస్తు సందీప్ రెడ్డి వంగ హీరోకి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చాడు. స్క్రీన్ మీద కనిపించే హీరో కూడా ఒక మనిషే అతనికి బాధ, ప్రేమ, ఇష్టం అన్నీ ఉంటాయని చూపించి వాటన్నింటినీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెబుతూ తన హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తాడు.ఆయనలోని మైనస్ లను కూడా గుర్తు చేస్తూ ఉంటాడు. మొత్తానికైతే సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరో మన రియల్ లైఫ్ లో కనిపించే క్యారెక్టర్ లాగే ఉంటాడు తప్ప అతనికి సూపర్ నాచురల్ పవర్స్ ఏమీ ఉండవు. సందీప్ హీరో ప్రతి సిచువేషన్ ను తన కంట్రోల్లోకి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అది వర్కౌట్ అవుతుంది. మరికొన్ని సార్లు అది మిస్ ఫైర్ అవుతుంటుంది.
కెరియర్ లో ఎన్ని కోల్పోతున్న కూడా హీరో మళ్ళీ ప్రయత్నం చేసి తను అనుకున్నది సాధించడానికి పడే స్ట్రగుల్స్ ని కూడా చూపిస్తాడు. సందీప్ రెడ్డి వంగ సినిమాల్లోని హీరో రియాల్టీకి దగ్గరగా ఉంటాడు. మొత్తానికైతే హీరోకి కొన్ని మైనస్ లు ఉన్నప్పటికి అతనిలో ఉన్న ప్లస్ పాయింట్స్ ని కూడా పర్ఫెక్ట్ గా చూపించే ప్రయత్నం చేస్తాడు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమాని ముందుకు నడిపించినప్పుడే ఆ క్యారెక్టర్ ప్రేక్షకుడికి నచ్చుతుంది. తద్వారా సినిమాని రిపీటెడ్ గా చూడడానికి ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. స్పిరిట్ మూవీ విషయంలో కూడా ప్రభాస్ ను చాలా బోల్డ్ గా చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన క్యారెక్టర్ లో ఉన్న ప్లస్ లు, మైనస్ లు అలాగే ఇష్టాలు, ఈగో లు ప్రతి దానిని పూర్తిస్థాయిలో ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చూపిస్తాడు. స్పిరిట్ సినిమా రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి సినిమా వస్తే గాని ప్రభాస్ ఎలా కనిపిస్తాడు. సందీప్ అతన్ని ఎలా చూపిస్తాడు అనే విషయంలో సరైన క్లారిటి రాదు...
