Begin typing your search above and press return to search.

సందీప్‌రెడ్డి వంగ ప్ర‌శంసిస్తూనే వార్నింగ్ ఇచ్చాడా?

ఈ మూవీపై సంచ‌ల‌న డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి వంగ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. త‌న‌దైన పంథాలో సినిమాపై, ర‌ణ్‌వీర్‌సింగ్‌, ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

By:  Ravindar Gorantla   |   11 April 2026 12:40 PM IST
సందీప్‌రెడ్డి వంగ ప్ర‌శంసిస్తూనే వార్నింగ్ ఇచ్చాడా?
X

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన స్పై యాక్ష‌న్ డ్రామా `ధురంధ‌ర్ ది రివేంజ్‌` రీసెంట్‌గా విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఆదిత్య‌ధ‌ర్ అత్యంత భారీ స్థాయిలో స్పై యూనివ‌ర్స్ మూవీస్‌కి షాక్ ఇస్తూ..స్పై మూవీ అంటే ఇద‌నే అర్థం వ‌చ్చేలా అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకుంటూ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు రికార్డుల్ని తిర‌గ‌రాసిన `ధురంధ‌ర్ 2`పై ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మార్చి 19న విడుద‌లైన ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.1658 కోట్లు రాబ‌ట్టి స‌రికొత్త రికార్డుల దిశ‌గా ప‌య‌నిస్తోంది.

ఈ మూవీపై సంచ‌ల‌న డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి వంగ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. త‌న‌దైన పంథాలో సినిమాపై, ర‌ణ్‌వీర్‌సింగ్‌, ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. `బుధ‌వారం రాత్రి `ధురంధ‌ర్ 2`ని చూశాన‌ని చెప్పిన సందీప్‌రెడ్డి వంగ సినిమా అద్భుతంగా ఉంద‌న్నారు. ఈ సినిమా విష‌యంలో ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్‌, హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌కు త‌గిలిన దిష్టి ఊరికే పోద‌ని, గుప్పెడంత మిర‌ప‌కాయ‌ల‌తోనూ ప‌ని కాద‌ని, మొత్తం మిర‌ప తోట‌నే త‌గుల‌బెట్టాల‌ని పేర్కొన్నారు.

రాజ‌కీయ పార్టీకి `ధురంధ‌ర్` చిత్రాలు ప్ర‌చార అస్త్రాలంటూ కొంద‌రు చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఈ సంద‌ర్భంగా సందీప్ ఖండించారు. స‌త్యాన్ని ప్ర‌చారంగా ముద్ర‌వేయ‌డం ఎప్నుడు మొద‌లైందో తెలియ‌ద‌న్నారు. ర‌చ‌యిత‌లు, న‌టులు ప్ర‌చారంతో త‌మ కెరీర్‌ను నిర్మించుకుంటున్నారు. ఇండ‌స్ట్రీ నిశ్శ‌బ్దంగా ఉండిపోయింది. అలాంటి వారు ఇప్పుడు `ధురంధ‌ర్‌`ను విమర్శిస్తున్నారు. స‌త్యాన్ని చెప్ప‌డం ప్రాప‌గండా అన‌డం వింత‌గా ఉంది` అంటూ బాలీవుడ్‌కు చేర‌క‌లు అంటించారు.

ఇదే ఇప్పుడు బాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. `క‌బీర్‌సింగ్‌`, యానిమ‌ల్ టైమ్‌లో యాంటిగా కొంత మంది సందీప్ రెడ్డి వంగ‌పై ప్ర‌చారం చేశారు. ఇప్పుడు అదే బ్యాచ్ సందీప్ వ్యాఖ్య‌ల‌పై హాట్ హాట్ చ‌ర్చ చేస్తోంద‌ట‌. `ధురంధ‌ర్ ది రివేంజ్` మూవీపై సందీప్‌రెడ్డి వంగ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తోంది. ప్రాప‌గండ ఫిల్మ్స్‌తో కొంత మంది రైట‌ర్లు, స్టార్లు త‌మ కెరీర్‌ని నిర్మించుకున్నార‌ని చేసిన కామెంట్స్ ఇప్పుడు అక్క‌డ మంట పెడుతున్నాయి.

స్టార్ రైట‌ర్స్‌, బాలీవుడ్‌ని ఇంత కాలం ఏలిన స్టార్స్ ప్రాప‌గండ స్క్రిప్ట్‌లు, సినిమాల‌తోనే స్టార్స్‌, స్టార్ రైట‌ర్స్‌గా ఎదిగార‌ని, కెరీర్‌ని బిల్డ్ చేసుకున్నార‌ని సందీప్ రెడ్డి వంగ చేసిన ఓపెన్ కామెంట్స్ బాలీవుడ్ వ‌ర్గాల‌కు వార్నింగ్ ఇచ్చిన‌ట్టుగా ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనిపై నెట్టింట పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. గ‌త కొన్నేళ్లుగా కొంత మంది కావాల‌నే చ‌రిత్ర‌ని వ‌క్రీక‌రిస్తూ పాఠ్య‌పుస్త‌కాల్లో మ‌న చ‌రిత్ర‌ని మ‌రుగున ప‌డేసిన‌ట్టుగానే మ‌న సంప్ర‌దాయాల‌ని బాలీవుడ్ సినిమాల్లో కావాల‌నే కించ‌ప‌రుస్తూ క‌థ‌లు, పాత్ర‌ల్ని సృష్టించార‌ని, వాట‌న్నింటికి `ధురంధ‌ర్ 2` చావు దెబ్బ కొట్టింద‌ని, సందీప్ రెడ్డి వంగ చేసిన ట్వీట్ బాలీవుడ్‌లో మ‌రింత మంట‌పెడుతోంద‌ని నెటిజ‌న్‌లు చ‌ర్చించుకుంటున్నారు.