Begin typing your search above and press return to search.

‘ధురంధర్ 2’ .. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సందీప్!

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ‘జస్క్రీత్ సింగ్ రంగీ’ అనే ఇండియన్ స్పై పాత్రలో నటించారు.

By:  Madhu Reddy   |   9 April 2026 10:13 PM IST
‘ధురంధర్ 2’ .. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సందీప్!
X

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన ఘాటైన వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. తాజాగా విడుదలైన బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రాన్ని ఆయన రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి వీక్షించారు. సినిమా చూసిన అనంతరం తన ఎక్స్‌ వేదికగా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూనే, విమర్శకులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ సినిమాను కేవలం ప్రచార చిత్రం అని ముద్ర వేసే వారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

ప్రభాస్‌తో కలిసి థియేటర్లో సందడి:

ప్రభాస్, సందీప్ వంగా బుధవారం రాత్రి కోకాపేటలోని అల్లు సినిమాస్‌లో ‘ధురంధర్ 2’ చిత్రాన్ని చూశారు. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి 'ఫౌజీ' షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, సమయం కేటాయించి మరీ ఈ సినిమాను చూడటం విశేషం. వీరిద్దరూ కలిసి థియేటర్లో సినిమా చూస్తున్న విజువల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఎండ్ క్రెడిట్స్ పడే వరకు ప్రభాస్ నిలబడి సినిమాను ఆస్వాదించడం ఆయనకు ఆ చిత్రం ఎంతగా నచ్చిందో చెప్తోంది. సందీప్ వంగా కూడా ఈ స్పై థ్రిల్లర్‌ మేకింగ్‌కు ఫిదా అయిపోయారు.

ప్రచారమా? నిజమా? సందీప్ ప్రశ్న:

సినిమాపై వస్తున్న విమర్శలను సందీప్ తీవ్రంగా ఖండించారు. "చాలామంది రచయితలు, నటులు ప్రచారం మీద కెరీర్లు నిర్మించుకున్నారు, అప్పుడు పరిశ్రమ పిల్లిలా మౌనంగా ఉంది. ఇప్పుడు అవే వర్గాలు ‘ధురంధర్’ను వెక్కిరిస్తున్నాయి. ఎదుటివారిని హేళన చేయడం లిబరల్ అనిపించుకోదు" అంటూ ఫైర్ అయ్యారు. నిజం చెబితే దానిని ప్రచారంగా ముద్ర వేయడం విడ్డూరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిత్య ధర్ మరియు రణవీర్ సింగ్‌లను ఉద్దేశించి "కేవలం గుప్పెడు మిరపకాయలతో ఈ దిష్టి పోదు.. ఏకంగా పొలాన్నే తగలబెట్టాలి" అంటూ తనదైన ఊరమాస్ స్టైల్లో కితాబిచ్చారు.

రణవీర్ సింగ్ ‘బీస్ట్ మోడ్’ పెర్ఫార్మెన్స్:

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ‘జస్క్రీత్ సింగ్ రంగీ’ అనే ఇండియన్ స్పై పాత్రలో నటించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఆయన నటనను సందీప్ 'అవుట్ స్టాండింగ్' అని కొనియాడారు. ఇక మూవీ లో 26/11 ముంబై దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌లో సాగే ఈ ఇన్వెస్టిగేటివ్ సీన్స్ లో రణవీర్ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని ప్రేక్షకులు కూడా అంటున్నారు. ఆర్. మాధవన్, సంజయ్ దత్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే వందల కోట్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టిస్తోంది.

వంగా మార్క్ సపోర్ట్:

ఎప్పుడూ తన సినిమాలపై వచ్చే విమర్శలను ధైర్యంగా ఎదుర్కొనే సందీప్ వంగా, ఇప్పుడు మరో దర్శకుడి సినిమాకు మద్దతుగా నిలవడం విశేషం. ‘ధురంధర్ 2’ చిత్రంలో చూపించిన ఎమోషన్ మరియు మేకింగ్ స్టాండర్డ్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాను చేస్తున్న సందీప్, ఇలాంటి ఒక పవర్‌ఫుల్ స్పై థ్రిల్లర్‌ను మెచ్చుకోవడం సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. మొత్తానికి సందీప్ వంగా చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ విమర్శకులకు గట్టి కౌంటర్ అనే చెప్పాలి.