Begin typing your search above and press return to search.

స్పిరిట్ లో మెగాస్టార్.. సందీప్ ఏమ‌న్నాడంటే?

టాలీవుడ్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా త‌న త‌ర్వాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sravani Lakshmi Srungarapu   |   12 Nov 2025 3:51 PM IST
స్పిరిట్ లో మెగాస్టార్.. సందీప్ ఏమ‌న్నాడంటే?
X

టాలీవుడ్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా త‌న త‌ర్వాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఓ ఆడియో టీజ‌ర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ బ‌జ్ ను క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగా. స్పిరిట్ టీజ‌ర్ తో కేవ‌లం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి హైప్ ను అందుకోగ‌లిగారు.

ప్ర‌భాస్ కు తండ్రిగా చిరూ

స్పిరిట్ సినిమా ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్లుకుండానే భారీ అంచ‌నాలు నెల‌కొన‌గా, గ‌త కొన్నాళ్లుగా ఈ సినిమా పై ఓ క్రేజీ రూమ‌ర్ నెట్టింట వినిపిస్తోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ సినిమాలో న‌టించ‌నున్నార‌ని, ఈ సినిమాలో ఆయ‌న ప్ర‌భాస్ కు తండ్రి పాత్ర‌లో క‌నిపిస్తార‌ని వార్త‌లు రావ‌డంతో స్పిరిట్ పై ఉన్న హైప్ ఇంకాస్త పెరిగింది.

స్పిరిట్ లో చిరంజీవి లేరు

అయితే ఈ వార్త‌ల‌పై రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చారు. స్పిరిట్ మూవీలో చిరంజీవి ప్ర‌భాస్ తండ్రిగా చేయ‌డం లేద‌ని, అస‌లు స్పిరిట్ సినిమాలో చిరంజీవి గారు ఏ పాత్ర‌లోనూ క‌నిపించ‌బోవ‌డం లేద‌ని, సోష‌ల్ మీడియాలో వస్తున్న వార్త‌ల‌న్నీ పుకార్లేన‌ని చెప్పారు. అయితే తాను చిరంజీవితో క‌లిసి వేరే సినిమా చేస్తానని సందీప్ క్లారిటీ ఇచ్చారు.

డాన్ లీ విష‌యంలో రియాక్ట్ అవ‌ని సందీప్

ఇదే సంద‌ర్భంగా సౌత్ కొరియ‌న్ యాక్ట‌ర్ డాన్ లీ విల‌న్ క్యారెక్ట‌ర్ చేస్తున్నారా అని అడ‌గ్గా, సందీప్ దాని గురించి మాత్రం అవున‌ని కానీ కాద‌ని కానీ చెప్ప‌లేదు. డాన్ లీ విష‌యంలో సందీప్ మౌనం వెనుక అంగీకార‌మే ఉంద‌ని, స్పిరిట్ లో డాన్ లీ భాగమ‌య్యార‌ని, అందుకే సందీప్ ఆ వార్త‌ల‌ను తిర‌స్క‌రించ‌లేద‌ని భావిస్తున్నారు. టీ సిరీస్, భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్న స్పిరిట్ సినిమాను ఈ నెల‌లోనే పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లుపెట్టి, వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని సందీప్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. యానిమ‌ల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీకి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తుండ‌గా, ఇప్ప‌టికే స్పిరిట్ మూవీకి సంబంధించిన 60% బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తైంద‌ని సందీప్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.