Begin typing your search above and press return to search.

చిరు, చరణ్ తో వంగా.. అదే నిజమైతే..

టాలీవుడ్‌ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో మార్మోగుతోంది.

By:  M Prashanth   |   24 May 2026 9:45 AM IST
చిరు, చరణ్ తో వంగా.. అదే నిజమైతే..
X

టాలీవుడ్‌ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో మార్మోగుతోంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో తనకంటూ స్పెషల్ స్టైల్‌ ను క్రియేట్ చేసుకున్న వంగా.. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నెట్టింట మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అదే.. వంగా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి కనిపించే అవకాశం ఉందన్న ప్రచారం.

అయితే సందీప్ రెడ్డి వంగా చాలా సందర్భాల్లో చిరంజీవిపై తన అభిమానాన్ని బయటపెట్టారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూసి పెరిగానని, ఆయనే తనకు ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పారు. అందుకే ఎప్పుడో ఒక రోజు చిరంజీవితో సినిమా చేయాలని కోరిక ఉందని పలుమార్లు వెల్లడించారు. అదే సమయంలో రామ్ చరణ్‌ తో కూడా ఓ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా చేయాలని వంగా ఆసక్తిగా ఉన్నారన్న టాక్ ఎప్పుడూ వినిపిస్తోంది.

ప్రస్తుతం వంగా లైనప్ చాలా బిజీగా ఉంది. స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ సినిమా చేయనున్నారని ఇప్పటికే క్లారిటీ ఉంది. కానీ ఆ రెండు ప్రాజెక్టుల మధ్యలో లేదా యానిమల్ పార్క్ తర్వాత మెగా కాంపౌండ్‌ తో ఆయన సినిమా ఉండొచ్చన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చరణ్ కోసం వంగా ఒక పవర్‌ ఫుల్ కథ సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ సినిమాలో చిరంజీవి కూడా కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందట. ఫుల్ లెంగ్త్ రోల్ కాకపోయినా, కథను మలుపు తిప్పే పవర్‌ ఫుల్ క్యారెక్టర్‌ గా చిరు కనిపిస్తారన్న చర్చ జరుగుతోంది. తండ్రీకొడుకులు ఒకే స్క్రీన్‌ పై కనిపిస్తే అభిమానులకు అది పండగలా మారడం ఖాయం. పైగా వంగా మార్క్ ఎమోషన్స్, ఇంటెన్స్ డ్రామా కలిస్తే సినిమా మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే రామ్ చరణ్ పాన్ ఇండియా మార్కెట్‌ ను స్ట్రాంగ్ గా ఏర్పరుచుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన ఇమేజ్ గ్లోబల్ స్థాయికి వెళ్లింది. మరోవైపు వంగా సినిమాలకు నార్త్ లో కూడా భారీ క్రేజ్ ఉంది. ఆ ఇద్దరి కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించే ఛాన్స్ ఉందని అంతా అంచనా వేస్తున్నారు. దీనికి చిరంజీవి కూడా కలిస్తే ఆ హైప్ మరింత పెరగడం ఖాయం అంటున్నారు.

ప్రస్తుతం ఆ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఆ కాంబోపై చర్చ గట్టిగా నడుస్తోంది. కొందరు అభిమానులు ఇప్పటికే ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా రూపొందిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే వంగా డైరెక్షన్‌ లో చిరు-చరణ్ కలిసి కనిపిస్తే అది కెరీర్‌ లోనే మోస్ట్ ఐకానిక్ ప్రాజెక్ట్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ ప్రచారంలో ఎంత నిజం ఉంది? వంగా నిజంగానే మెగా కాంపౌండ్ కోసం స్పెషల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారా? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.