Begin typing your search above and press return to search.

యాపిల్ ఐఫోన్ కలర్‌పై వంగా `యానిమాల్` సీన్ మ్యాజిక్!

యాపిల్ సంస్థ తాజాగా తన ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో భాగంగా విడుదల చేసిన 'ఐఫోన్ 18 ప్రో మాక్స్' ఫోన్ల కోసం ప్రత్యేకంగా 'బర్గుండి' రంగును పరిచయం చేసింది.

By:  Sivaji Kontham   |   13 Sept 2026 5:56 PM IST
యాపిల్ ఐఫోన్ కలర్‌పై వంగా `యానిమాల్` సీన్ మ్యాజిక్!
X

బాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆలోచనల స్థాయి ఎక్కడి వరకు ఉంటుందో మరోసారి నిరూపితమైందంటూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా `యానిమల్` చిత్రంలోని ఒక ప్రత్యేకమైన సన్నివేశం ఇప్పుడు ఏకంగా ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజం `యాపిల్` కంపెనీ కొత్త ఐఫోన్ కలర్‌తో ముడిపడి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విచిత్రమైన పోలికను చూసిన నెటిజన్లు సందీప్ వంగా డీప్ థింకింగ్ లెవెల్స్ వేరే లెవెల్ అంటూ కామెంట్లు చేస్తుండటం విశేషం.

యాపిల్ సంస్థ తాజాగా తన ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో భాగంగా విడుదల చేసిన `ఐఫోన్ 18 ప్రో మాక్స్` ఫోన్ల కోసం ప్రత్యేకంగా `బర్గుండి` రంగును పరిచయం చేసింది. ఇదే ఈ ఫన్నీ మీమ్స్ - కొత్త చర్చకు ప్రధాన కారణమైంది. యాపిల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త డీప్ వైన్-రెడ్ లేదా బర్గుండి కలర్ షేడ్ అట్టడుగున ఉన్న రంగు... బాలీవుడ్ చిత్రం `యానిమల్`లో రణ్‌బీర్ కపూర్ - త్రిప్తి దిమ్రి మధ్య వచ్చే అత్యంత చర్చనీయాంశమైన `లవ్-మార్క్` సన్నివేశంలోని గుర్తును పోలి ఉందని నెటిజన్లు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ యాథృచ్ఛిక పోలికకు సోషల్ మీడియాలో మరింత బలం చేకూరుస్తూ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. యాపిల్ కొత్త ఉత్పత్తుల లాంచ్ ఈవెంట్ క్యుపర్టినోలో జరగగా... ఆ ఈవెంట్‌కు `యానిమల్` నటి త్రిప్తి దిమ్రి స్వయంగా హాజరయ్యారు. యాపిల్ అధికారుల పక్కన నిలబడి ట్రిప్తి కొత్త ఫోన్లను పరిశీలిస్తున్న ఫొటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. దీంతో యాపిల్ కంపెనీ కావాలనే ఆ సినిమాలోని ఆ ప్రత్యేక సన్నివేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ `బర్గుండి` కలర్‌ను తయారు చేసిందంటూ నెటిజన్లు సరదాగా జోకులు పేల్చుతున్నారు.

కాగా ఇదే లాంచ్ ఈవెంట్‌లో యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ అయిన `ఐఫోన్ డూయో` ను కూడా స్టార్ వైట్, నైట్ స్కై అనే రెండు విభిన్న రంగులలో ఆవిష్కరించింది. అయినా అందరి దృష్టి మాత్రం ఐఫోన్ 18 ప్రో కొత్త బర్గుండి కలర్ పైనే నిలిచింది. త్రిప్తి దిమ్రి ఈ ఈవెంట్‌లో ప్రత్యక్షం కావడం... ఆ కలర్ ఛాయిస్ సరిగ్గా ఆ సినిమా సీన్‌ను పోలి ఉండటంతో సినీ, టెక్కీ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

మొత్తంగా ఒక సినిమాలోని చిన్న సన్నివేశం ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ ప్రొడక్ట్ కలర్‌తో ముడిపడి ఇలా ట్రెండ్ కావడాన్ని నెటిజన్లు విపరీతంగా ఆస్వాధిస్తున్నారు. కొందరు దీన్ని కేవలం ఒక యాదృచ్ఛిక తమాషాగా కొట్టిపారేస్తుంటే.. మరికొందరు మాత్రం సందీప్ వంగా క్రియేటివ్ మార్క్ గ్లోబల్ లెవెల్‌లో టెక్నాలజీని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తోందంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫన్నీ కనెక్షన్ ప్రస్తుతం నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.