Begin typing your search above and press return to search.

ఫ్ర‌స్టేట్ అయిపోయి ట్వీట్స్ వేయెడమెందుకు?.. సందీప్ కు మారుతి క్లాస్!

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్.. ఇప్పుడు దర్శకుడిగా రెండో సినిమా మోగ్లీ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   11 Dec 2025 10:15 AM IST
ఫ్ర‌స్టేట్ అయిపోయి ట్వీట్స్ వేయెడమెందుకు?.. సందీప్ కు మారుతి క్లాస్!
X

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్.. ఇప్పుడు దర్శకుడిగా రెండో సినిమా మోగ్లీ చేస్తున్న విషయం తెలిసిందే. యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల లీడ్ రోల్ లో రూపొందిన ఆ చిత్రం.. అక్టోబర్ 13వ తేదీన విడుదల కానుంది. అక్టోబర్ 12న రిలీజ్ కావాల్సిన మోగ్లీ.. బాలయ్య అఖండ 2 తాండవం వస్తుండడంతో పోస్ట్ పోన్ అయింది.

అంతకుముందు.. వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవ్వనుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తాను దురదృష్టవంతుడినని, తన బదులు మరో డైరెక్టర్ మోగ్లీ మూవీ తీసి ఉంటే బాగుండేందని అన్నారు. తానంటే సిల్వర్ స్క్రీన్ కు ద్వేషమోమో అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

దీంతో కొందరు సందీప్ రాజ్ కు మద్దతు పలకగా.. మరికొందరు విమర్శలు చేశారు. ఆ తర్వాత మళ్లీ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మరో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై డైరెక్టర్ మారుతి స్పందించారు. మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన మారుతి.. సందీప్ ను ఉద్దేశించి వేదికపై మాట్లాడారు.

"సందీప్ ను తనకు ఎస్ కే ఎన్ మంచి టాలెంటెడ్ పర్సన్ అంటూ పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇద్దరూ ట్రావెల్ అవుతున్నారు. అయితే తనకు మోగ్లీ కథను సందీప్ చెప్పాడు. సినిమాలోని లీడ్ రోల్ లో రోషన్ కనిపిస్తున్నాడని సందీప్ అనేవాడు. అతడి సంకల్పం చాలా గొప్పది. పాజిటివ్ పర్సన్" అంటూ మారుతి చెప్పుకొచ్చారు.

కానీ ఈ మధ్య చిన్న చిన్న వాటికి ఫ‌స్ట్రేట్ అయిపోతున్నాడని అన్నారు. "సోష‌ల్ మీడియా ఉంది క‌దా అని అంద‌రిలా నువ్వు కూడా ట్వీట్స్ వేస్తున్నావు" అంటూ సందీప్ ను చూసి మాట్లాడారు. "బాలయ్య బాబు గారు మన దగ్గరకు రావడం మన అదృష్టం. ఆయ‌న రాబ‌ట్టి మోగ్లీ సినిమా తెలియ‌ని వాళ్ల‌కు కూడా తెలిసింది" అని చెప్పారు.

"ఎందుకంటే అప్ప‌ట్లో శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ మూవీతో పాటు ఆనంద్ సినిమా రావ‌డంతోనే అంద‌రికీ తెలిసింది. జ‌నాలు అప్పుడు ఆ మూవీని కూడా చూశారు. అందుకే సందీప్ కూడా బాల‌య్య బాబు బ్లెస్సింగ్‌ తో ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. ఏదేమైనా కొత్త డేట్ రావ‌టం మంచిదేమో. దాని గురించి ఫ్ర‌స్టేట్ అయిపోయి ట్వీట్స్ వేసేసి, కామెంట్స్ చేయ‌టం క‌రెక్ట్ కాదు" అంటూ మారుతి అభిప్రాయపడ్డారు. సందీప్ చాలా ఎద‌గాలంటూ ఆకాంక్షించారు. సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకున్నారు.