Begin typing your search above and press return to search.

కావలసినంత రౌండప్.. ఇక కంటెంట్ గట్టెక్కించాలి..

పైగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ చేయాల్సింది చేశాడు. ఇలా తెరవెనుక జరగాల్సిన రౌండప్ అంతా పక్కాగా ఫినిష్ అయింది.

By:  M Prashanth   |   29 Sept 2026 5:12 PM IST
కావలసినంత రౌండప్.. ఇక కంటెంట్ గట్టెక్కించాలి..
X

‘సిగ్మా’కు కావాల్సినంత హంగామా అయితే ముందే సెట్ అయిపోయింది. అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ కానుంది. పోస్టర్ల మీద పెద్ద పెద్ద పేర్లు కనిపించాయి, సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్ అనగానే కోలీవుడ్‌లో ఆటోమేటిక్ బజ్ వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ లాంటి బడా బ్యానర్ ఖర్చుకు వెనకాడకుండా ప్రాజెక్ట్‌ను నిలబెట్టింది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ లాంటి టాప్ డిస్ట్రిబ్యూటర్ చేతిలో పడటంతో థియేటర్ల కొరత అనే మాటే లేకుండా పోయింది.

పైగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ చేయాల్సింది చేశాడు. ఇలా తెరవెనుక జరగాల్సిన రౌండప్ అంతా పక్కాగా ఫినిష్ అయింది. స్టార్ వారసుడి బ్రాండ్, కార్పొరేట్ సంస్థల నెట్‌వర్క్, అగ్ర డిస్ట్రిబ్యూషన్ అండదండలు.. ఒక సినిమాను మార్కెట్‌లో భారీగా నిలబెట్టడానికి ఏమేం కావాలో అవన్నీ సందీప్ కిషన్ టేబుల్ మీద రెడీగా ఉన్నాయి. బజ్ క్రియేట్ చేయడం వరకు మేకర్స్ ప్లానింగ్ నూటికి నూరు శాతం సక్సెస్ అయింది.

అయితే ఇక్కడితో ప్రమోషన్ల పని అయిపోయింది, ఇక అసలైన కథ మొదలుకావాల్సింది స్క్రీన్ మీదే. తెరవెనుక ఎంత పెద్ద సైన్యం నిలబడినా, ఫస్ట్ డే మార్నింగ్ షో పడగానే థియేటర్లో ఆడియన్ చూసేది సినిమాలో దమ్ముందా లేదా అనేదే. లైకా పెట్టిన ఖర్చు గానీ, మైత్రీ తెచ్చిన స్క్రీన్ల లెక్కలు గానీ బాక్సాఫీస్ దగ్గర టికెట్లు తెగడానికి మొదటి ఆట వరకే పనికొస్తాయి.

ఆ తర్వాత సినిమాని నిలబెట్టాల్సింది కేవలం కంటెంట్ మాత్రమే. సందీప్ కిషన్ కెరీర్‌కు ఇది అత్యంత కీలకమైన టైమ్. విజయ్ కొడుకు రాసుకున్న స్టైలిష్ హీస్ట్ డ్రామా లోకల్ యూత్‌ను ఎంతవరకు మెప్పిస్తుందనే దానిపైనే సందీప్ సక్సెస్ ఆధారపడి ఉంది. వెస్ట్రన్ టచ్‌తో చేసిన ఈ ప్రయోగం మన ఆడియన్స్ పల్స్‌కు సింక్ కాకపోతే, ఈ భారీ రౌండప్ అంతా వృథా అయిపోతుంది.

అందుకే ఇప్పుడు చర్చంతా కంటెంట్ చుట్టూనే తిరుగుతోంది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జాసన్ సంజయ్ టేకింగ్ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో కూర్చోబెడతాయో చూడాలి. పబ్లిసిటీ గట్టెక్కింది, ప్లాట్‌ఫామ్ సెట్ అయింది.. మరి ఈ కంటెంట్ బాక్సాఫీస్‌ను గట్టెక్కిస్తుందో లేదో తెలియాలంటే థియేటర్లలో షోలు పడేవరకు ఆగాల్సిందే.