Begin typing your search above and press return to search.

సంయుక్త మీనన్ రిస్క్ చేస్తోందా?

ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్‌గా ఉన్న పూరీ జగన్నాథ్ గ్రాఫ్ ఈమధ్య కాస్త తగ్గింది. ఆయన తీసిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు, 'డబుల్ ఇస్మార్ట్' కూడా యావరేజ్ ఫలితాన్నే అందించింది.

By:  Madhu Reddy   |   11 Sept 2026 2:00 PM IST
సంయుక్త మీనన్ రిస్క్ చేస్తోందా?
X

వరస విజయాలతో టాలీవుడ్‌లో "గోల్డెన్ లెగ్"గా పేరు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న 'స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్' నుంచి విడుదలైన పోస్టర్లు, పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే వరస ఫ్లాపుల్లో ఉన్న పూరీతో, క్రేజీ సక్సెస్ ట్రాక్‌లో ఉన్న సంయుక్త సినిమా చేయడంపై సినీ విశ్లేషకులు, నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

టాలీవుడ్‌లో సంయుక్త అన్‌స్టాపబుల్ ట్రాక్:

పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి సంయుక్త ఎంచుకున్న ప్రతి కథా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది. 'బింబిసార', ధనుష్‌తో చేసిన 'సార్', సాయి ధర్మ తేజ్‌తో వచ్చిన 'విరూపాక్ష' సినిమాలు భారీ హిట్లుగా నిలిచి ఆమెను స్టార్ హీరోయిన్‌ను చేశాయి.అంతేకాక గత ఏడాది బాలకృష్ణతో 'అఖండ 2', ఈ ఏడాది శర్వానంద్‌తో 'నారీ నారీ నడుమ మురారీ' వంటి క్రేజీ హిట్ మూవీస్ తో టాలీవుడ్‌లో తిరుగులేని హవా కొనసాగిస్తోంది.

పూరీ ఫామ్‌పై విశ్లేషకుల అనుమానాలు:

ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్‌గా ఉన్న పూరీ జగన్నాథ్ గ్రాఫ్ ఈమధ్య కాస్త తగ్గింది. ఆయన తీసిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు, 'డబుల్ ఇస్మార్ట్' కూడా యావరేజ్ ఫలితాన్నే అందించింది. అలాంటి సమయం లో పూరీతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా కొంచెం ఆలోచించాల్సిందే. కానీ సంయుక్త మాత్రం ఈ 'స్లమ్ డాగ్' ప్రాజెక్ట్‌లో కీ రోల్ చేయడానికి ముందేసుకొచ్చింది.

పెద్ద రిస్క్.. తేడా కొడితే కెరీర్‌పై ప్రభావం?:

బర్త్‌డే స్పెషల్ పోస్ట్స్, షూటింగ్ లొకేషన్ స్టిల్స్ చూస్తే సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉన్నట్లు అర్థమవుతోంది. విజయ్ సేతుపతితో కలిసి సంయుక్త చేసే ఈ యాక్టింగ్ విందు సక్సెస్ అయితే ఆమె క్రేజ్ మరో మెట్టు ఎక్కుతుంది. కానీ ఒకవేళ సినిమా తేడా కొడితే మాత్రం, ఇప్పటివరకు ఉన్న ఆమె సక్సెస్ రేట్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఇది అమ్మడు తీసుకున్న పెద్ద రిస్క్ అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

చేతినిండా భారీ ప్రాజెక్టులు :

ఈ ఒక్క సినిమానే కాకుండా సంయుక్త చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్‌తో 'హైందవ', నిఖిల్ సరసన 'స్వయంభు', రాఘవ లారెన్స్‌తో 'బెంజ్' చిత్రాలతో పాటు హిందీలో 'మహారాణి' , Rapo 23 వంటి ప్రాజెక్టులు ఆమె లైనప్‌లో ఉన్నాయి.

హిట్ ట్రాక్‌లో ఉన్న హీరోయిన్, ఫామ్ కోసం చూస్తున్న మాస్ డైరెక్టర్‌తో జతకట్టడం సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక సంయుక్త నమ్మిన ఈ 'స్లమ్ డాగ్' ఆమె గోల్డెన్ రన్‌ను ముందుకు తీసుకెళ్తుందో లేక చిన్న బ్రేక్ వేస్తుందో చూడాలి. పూరీ మార్క్ మేజిక్ వర్కవుట్ అయితే మాత్రం ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం..