Begin typing your search above and press return to search.

బ్లాక్ డ్రెస్ లో మతులు పోగొడుతున్న సంయుక్త!

సంయుక్త మీనన్.. ప్రముఖ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. మలయాళ కుట్టి అయినప్పటికీ తెలుగులో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది.

By:  Madhu Reddy   |   14 Sept 2025 8:00 AM IST
బ్లాక్ డ్రెస్ లో మతులు పోగొడుతున్న సంయుక్త!
X

సంయుక్త మీనన్.. ప్రముఖ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. మలయాళ కుట్టి అయినప్పటికీ తెలుగులో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ మరింత బిజీగా మారిన సంయుక్త మీనన్.. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో ఐదు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె.. తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఒక్కొక్క చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


ఇదిలా ఉండగా పలు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఒలకబోస్తోంది. అందులో భాగంగానే తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన ఈమె.. తన కళ్ళతో చూసే ఆడియన్స్ హృదయాలను దోచుకుంటోంది అని చెప్పవచ్చు. తాజాగా థైస్ అందాలు కనిపించేలా బ్లాక్ డ్రెస్ ధరించిన ఈ ముద్దుగుమ్మ.. జుట్టును అలా గాలికి వదిలేసి మరింత మత్తెక్కిస్తోంది. మొత్తానికి అయితే సంయుక్త మీనన్ తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయని చెప్పవచ్చు.


సంయుక్త మీనన్ విషయానికి వస్తే.. 2016లో 'పాప్ కార్న్' అనే చిత్రం ద్వారా మలయాళ సినీ ఇండస్ట్రీలోకి నటిగా అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత తెలుగులో 'భీమ్లా నాయక్' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో పవన్ కళ్యాణ్, రానా నటించగా.. రానా భార్యగా తన నటనతో మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసారా' సినిమాతో పూర్తిస్థాయి హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త మీనన్ .. ఆ తర్వాత ధనుష్ హీరోగా వచ్చిన 'సార్' సినిమాతో మరొకసారి ఆకట్టుకుంది. ఇందులో చాలా సాంప్రదాయంగా టీచర్ పాత్రలో కనిపించి అందరిని ఆకట్టుకుంది..


ఇకపోతే సంయుక్త అమాయకంగా నటించడమే కాదు 'విరూపాక్ష' వంటి చిత్రాలతో భయపెట్టగలను అని కూడా మరొకసారి నిరూపించింది. ఇందులో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించారు. ఆయన రీ ఎంట్రీలో వచ్చిన ఈ సినిమా ఇటు సంయుక్త మీనన్ కి కూడా మంచి గుర్తింపును అందించింది. ఒక సంయుక్త మీనన్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.. అందులో భాగంగానే తెలుగులో శర్వానందా 37వ సినిమాలో అవకాశం అందుకున్న ఈమె.. అటు నిఖిల్ హీరో వస్తున్న 'స్వయంభూ' సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు బిఎస్ఎస్ 12 సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుంది సంయుక్త మీనన్. ఇక ఒకవైపు తెలుగులో నటిస్తున్న ఈమె మరొకవైపు హిందీలో 'మహారాగ్ని: క్వీన్ ఆఫ్ క్వీన్స్' అనే సినిమాలో అవకాశాన్ని అందుకుంది. అలాగే రామ్ అనే మలయాళం చిత్రంతో పాటు ఒక తమిళ్ సినిమాలో కూడా హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది.