Begin typing your search above and press return to search.

చీరకట్టులో సంయుక్త అందాలు.. ఆ సోయగానికి ఫిదా!

సంయుక్త మీనన్.. పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో పోషిస్తూ వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో రానాకి జోడిగా.. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Madhu Reddy   |   18 Jan 2026 5:00 AM IST
చీరకట్టులో సంయుక్త అందాలు.. ఆ సోయగానికి ఫిదా!
X

సంయుక్త మీనన్.. పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో పోషిస్తూ వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో రానాకి జోడిగా.. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇకపోతే పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె గత ఏడాది బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సీక్వెల్ అఖండ 2 సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ ఏడాది శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాలో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పవచ్చు.




ఇకపోతే ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన నేపథ్యంలో మరొకవైపు తన అందంతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా పట్టుచీర కట్టుకొని అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా భిన్నభిన్నమైన ఫోజులు ఇస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. సింపుల్ హెయిర్ స్టైల్ తో జడలో మల్లె పువ్వులు పెట్టుకొని చేతిలో తామర పువ్వు పట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా పెద్ద పెద్ద జుంకాలతో తన అందాన్ని రెట్టింపు చేసుకున్న ఈమె మెడలో ఏమీ లేకపోయినా తన అందంతో అభిమానులను ఆకట్టుకుంది..మొత్తానికైతే సంయుక్త మీనన్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.




2016లో పాప్ కార్న్ అనే మలయాళం చిత్రంతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తమిళ్, కన్నడ, తెలుగు సినిమాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. భీమ్లా నాయక్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నేరుగా తెలుగులో చేసిన చిత్రం సార్. ఈ సినిమాలో టీచర్ పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ఇక ఆ తర్వాత వచ్చిన విరూపాక్ష సినిమాలో మరోసారి తన నటనతో మంచి మార్కులు వేయించుకుందని చెప్పవచ్చు. హీరోయిన్గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇందులో డెవిల్ పాత్రలో అందరిని భయపెట్టేసింది. అలా తన పర్ఫామెన్స్ తో మెప్పిస్తున్న ఈమె ఇప్పుడు నారి నారి నడుమ మురారి చిత్రంలో మరోసారి మెప్పించింది. ఇక ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమాలో నటిస్తోంది. ఇందులో మరో హీరోయిన్ నభా నటేష్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత మహారాగ్ని అనే హిందీ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా రామ్ అనే మలయాళం చిత్రంలో నటిస్తున్న ఈమె.. బెంజ్ అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. అంతేకాదు విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ కాంపినేషన్లో వస్తున్న స్లమ్ డాగ్ అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.