Begin typing your search above and press return to search.

జిమ్‌లో టోన్డ్ బాడీ కోసం సంయుక్త క‌ష్టం చూసారా?

తాజాగా బ్లూ బాడీ ఫిట్ జిమ్నాస్టిక్ దుస్తుల‌ను ధ‌రించి సంయుక్త జిమ్ లో చెమ‌ట‌లు చిందిస్తున్న ఫోటోలు వైర‌ల్ గా మారుఉన్నాయి.

By:  Sivaji Kontham   |   3 March 2026 11:33 PM IST
జిమ్‌లో టోన్డ్ బాడీ కోసం సంయుక్త క‌ష్టం చూసారా?
X

టాలీవుడ్ గోల్డెన్ లెగ్ సంయుక్త మీనన్ గురించి తెలుగుసుకునే కొద్దీ ఇంట్రెస్టింగ్ విష‌యాలున్నాయి. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ఇటీవ‌ల‌ తన ఫిట్‌నెస్ మంత్రంతో నెటిజన్ల గుండెల్లో మంటలు రేపుతోంది. జిమ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తూ, చెమటలు చిందిస్తున్న ఫోటోలను ఈ బ్యూటీ నిరంత‌రం సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

తాజాగా బ్లూ బాడీ ఫిట్ జిమ్నాస్టిక్ దుస్తుల‌ను ధ‌రించి సంయుక్త జిమ్ లో చెమ‌ట‌లు చిందిస్తున్న ఫోటోలు వైర‌ల్ గా మారుఉన్నాయి. దీనికి `ఫీల్ ది బ‌ర్న్ బేబి` అంటూ ఇచ్చిన క్యాప్షన్ త‌న‌ శ్రమకు అద్దం పడుతోంది. పర్ఫెక్ట్ ఫిజిక్ కోసం సంయుక్త‌ పడుతున్న తపన చూస్తుంటే.. అంద‌గ‌త్తెల‌కు కేవలం అదృష్టం మాత్రమే కాదు.. అంకితభావం కూడా ఉండాలని నిరూపిస్తోంది.

జిమ్‌లో సంయుక్త చేస్తున్న వర్కవుట్స్ చూస్తుంటే ఫిట్‌నెస్ విష‌యంలో ఈ భామ‌కు ఉన్న మక్కువ అర్థమవుతోంది. టైట్ ఫిట్ జిమ్ వేర్‌లో హా* గాళ్ కనిపిస్తున్న తీరు, ఆ బాడీ లాంగ్వేజ్ అభిమానుల మనసు దోచుకుంటున్నాయి. అందానికి ప్రతిభ తోడవ్వడమే కాదు.. నిరంతరం కష్టించే తత్వం ఉండటం వల్లే ఈరోజు పరిశ్రమలో అగ్ర హీరోయిన్ హోదా దక్కుతోంది. ఈ ఫోటోషూట్ ఇప్పుడు కుర్రకారులో కొత్త స్ఫూర్తిని నింపుతూ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

సంయుక్త మీనన్ కెరీర్‌లో దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అండదండలు, సపోర్ట్ పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. త‌న‌లోని నటనను గుర్తించి వరుసగా అవకాశాలు కల్పించడంలో మాట‌ల మాయావి పాత్ర కీలకం. సరైన కథలను ఎంచుకుంటూ.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్న ఈ బ్యూటీ అటు గ్లామర్ పరంగా, ఇటు పెర్ఫార్మెన్స్ పరంగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతోంది.

సంయుక్త గోల్డెన్ లెగ్ ప్రయాణం!

కేరళకు చెందిన సంయుక్త మీనన్ మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. మొదట చిన్న చిన్న పాత్రలతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినా, తనలోని నటనతో అతి త్వరగానే గుర్తింపు పొందింది. `తీవండి` వంటి చిత్రాలు ఆమెకు మలయాళంలో మంచి బ్రేక్ ఇచ్చాయి. భాష ఏదైనా పాత్రలో లీనమై నటించడమే ఈ భామ‌ విజయ రహస్యం. తెలుగులోకి `భీమ్లా నాయక్` చిత్రంతో అడుగుపెట్టిన సంయుక్త, మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ తర్వాత వచ్చిన బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించడంతో ఆమెను ఇండస్ట్రీ `గోల్డెన్ లెగ్`గా పిలవడం మొదలుపెట్టింది. నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోల కళ్లలో పడింది.

సంయుక్త కెరీర్‌లో వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా, కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటోంది. గ్రామీణ యువతిగా, మోడ్రన్ అమ్మాయిగా, భయపెట్టే పాత్రలో ఇలా ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపిస్తూ నటిగా తన స్థాయిని పెంచుకుంది. అందుకే నేడు త‌న‌కు భారీ బడ్జెట్ చిత్రాల్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

ప్ర‌స్తుత సినిమాలు..

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్ డ్రామా `స్వ‌యంభు`లో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం సంయుక్త ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో ఆమె లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని సమాచారం. మహారాగ్ని: క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే హిందీ చిత్రంలోను న‌టిస్తోంది. బాలీవుడ్ లెజెండ్ కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో సంయుక్త బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఇందులో సంయుక్త `మోహిని` అనే కీలక పాత్రలో నటిస్తోంది. ప్రభుదేవా కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబై పరిసరాల్లో జరుగుతోంది. ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడానికి సంయుక్త సిద్ధమైంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ - దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ రామ్ లోను న‌టిస్తోంది. లోకేష్ కనగరాజ్ సమర్పణలో, రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న `బెంజ్`లో సంయుక్త క‌థ‌నాయిక‌. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్ అనే మరో వైవిధ్యమైన ప్రాజెక్ట్ లోను సంయుక్త న‌టిస్తోంంది.