కథ వినగానే ఫ్లాట్.. హైందవ సెట్ సీక్రెట్స్ చెప్పేసిన సంయుక్త
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ డివైన్ మిస్టరీ థ్రిల్లర్ హైందవ. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు చాలా గ్రాండ్ గా జరిగింది.
By: M Prashanth | 14 Oct 2026 8:24 PM ISTబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ డివైన్ మిస్టరీ థ్రిల్లర్ హైందవ. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోయిన్ సంయుక్త మీనన్ తన స్పీచ్ తో ఫ్యాన్స్ అటెన్షన్ డ్రా చేశారు. సినిమా మొదలైనప్పటి నుంచి టీజర్ రిలీజ్ అయ్యే వరకు జరిగిన చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో పంచుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కు తానెలా సైన్ చేశాననేది చాలా సరదాగా వివరించారు.
డైరెక్టర్ లూధీర్ బైరెడ్డి స్టోరీ చెప్పే విధానం చూసి తను ఫిదా అయిపోయానని సంయుక్త చెప్పారు. దాదాపు రెండు మూడేళ్ల క్రితం ఆయన తన దగ్గరకు వచ్చి కథ చెప్పిన తీరు భలే అనిపించిందట. సీన్స్ ఎక్స్ ప్లెయిన్ చేయడంతో పాటు ఒక పిచ్ డెక్ రెడీ చేసుకుని.. అందులో విజువల్స్, ఒక విగ్రహం ఫోటో చూపించిన విధానం తనకు బాగా నచ్చేసిందని క్లారిటీ ఇచ్చారు.
ఆ నేరేషన్ విన్న వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ప్రాజెక్ట్ కు ఓకే చెప్పేశానని ఆమె అసలు విషయం రివీల్ చేశారు. ఈవెంట్ లో మాట్లాడుతూ తన నెర్వస్ నెస్ గురించి ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు తాను చాలా కూల్ గానే ఉన్నానని, కానీ స్టేజ్ పై డైరెక్టర్ లూధీర్, ప్రొడ్యూసర్ మహేష్ మాట్లాడిన తీరు చూసి ఆ టెన్షన్ కాస్తా తనకు కూడా పాకిందని సరదాగా అన్నారు. ఆ టెన్షన్ తట్టుకోలేక తనను సేవ్ చేయాలంటూ పక్కనే ఉన్న సాయి శ్రీనివాస్ ను సరదాగా నవ్వించారు.
సాయికి ఎప్పుడూ మంచి ఎనర్జీ ఉంటుందని, అతనికి ఇలా నెర్వస్ ఫీల్ అవ్వడం అస్సలు సెట్ కాదని ఫన్నీగా కౌంటర్ వేశారు. సినిమా టెక్నికల్ వాల్యూస్ గురించి చెబుతూ కెమెరామెన్ హరీష్ వర్క్ ను సంయుక్త తెగ మెచ్చుకున్నారు. ఆయన తీసిన విజువల్స్ చాలా అద్భుతంగా వచ్చాయని, ప్రతి షాట్ అయిపోయిన తర్వాత ఔట్ పుట్ చూడటానికి ఎంతో క్యూరియాసిటీతో మానిటర్ దగ్గరకు వెళ్లేవాళ్లమని షూటింగ్ అనుభవాలు పంచుకున్నారు. సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నో అందమైన లొకేషన్లలో చాలా నేచురల్ గా చిత్రీకరించారని ఆమె చెప్పుకొచ్చారు.
సెట్స్ లో వాతావరణం ఎలా ఉందనే దానిపై కూడా ఆమె ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. హీరో సాయి శ్రీనివాస్, ప్రొడ్యూసర్ మహేష్ ఇద్దరూ బయట చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ల మధ్య ఉన్న ఆ బాండింగ్ సినిమా సెట్స్ లో చాలా పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేసిందని అన్నారు. ఎలాంటి ప్రెజర్ లేకుండా యూనిట్ మొత్తానికి ఎంతో హ్యాపీ వాతావరణాన్ని వాళ్లు అందించారని ఆమె సంతోషంగా చెప్పారు.
ఫైనల్ గా టీజర్ ఔట్ పుట్ పై తానెంతో శాటిస్ఫై అయినట్లు సంయుక్త క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ సమయంలో తనకు రఫ్ కట్ చూపించారని, కానీ ఇప్పుడు ఫుల్ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ తో చూస్తుంటే ఎంతో బ్యూటిఫుల్ గా అనిపించిందని మురిసిపోయారు. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని ఎక్స్ ప్రెస్ చేస్తూ.. త్వరలో రాబోయే ట్రైలర్ కోసం ఆడియన్స్ వెయిట్ చేయాలని సూచించారు. ఆ ట్రైలర్ ఇంకా అమేజింగ్ గా ఉండబోతోందని సినిమాపై హైప్ పెంచారు.
