ట్రాన్స్పరెంట్ అందాలతో హొయలుపోతున్న సంయుక్త!
ప్రముఖ హీరోయిన్ సంయుక్త గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అమాయకంగా కనిపిస్తూనే.. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
By: Madhu Reddy | 9 Feb 2026 9:26 AM ISTప్రముఖ హీరోయిన్ సంయుక్త గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అమాయకంగా కనిపిస్తూనే.. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తొలిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో వచ్చిన 'భీమ్లా నాయక్' సినిమాలో రానా భార్య పాత్రలో నటించి ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో సన్నివేశాలు ప్రేక్షకుల చేత కంటతడి కూడా తెప్పిస్తాయి. అలా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న సంయుక్త మీనన్.. 2016లోనే 'పాప్ కార్న్' అనే మళయాల చిత్రం ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఒక్కో భాషా చిత్రంలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈమె తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం భాషల్లో నటిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది సంయుక్త మీనన్. ఈ మధ్యకాలంలో రోజుకొక గ్లామర్ ఫోటో షూట్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా ట్రాన్స్పరెంట్ దుస్తులు ధరించి తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో కొంటెగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈమె ఈ ఫోటోలను షేర్ చేస్తూ.."కొంచెం సాఫ్ట్.. కొంచెం హట్" అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ షేర్ చేసిన ఈ ఫోటోలకు అటు నెటిజన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
2022లో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా సినిమాలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2023లో తెలుగు, తమిళ్ బైలింగ్వల్ గా వచ్చిన సార్ సినిమాలో టీచర్ క్యారెక్టర్ లో మరింతగా ఆకట్టుకుంది. ఇక తెలుగు, తమిళ్ అని తేడా లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈమె గత ఏడాది చివర్లో నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2లో నటించి ఆకట్టుకున్న ఈమె.. ఈ ఏడాది శర్వానంద్ సరసన 'నారీ నారీ నడుమ మురారి' సినిమాలో హీరోయిన్గా నటించింది.
వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా నిలవాల్సి ఉంది కానీ ఈ సినిమా విడుదలైనప్పుడు అప్పటికే మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. అటు ది రాజాసాబ్ కూడా విడుదలైంది. దీంతో ఈ చిత్రానికి థియేటర్ల కొరత ఏర్పడడంతో.. కంటెంట్ బాగున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం రాలేదనే వార్తలు వ్యక్తం అయ్యాయి. ఇకపోతే సంయుక్త మీనన్ ప్రస్తుతం నిఖిల్ స్వయంభు సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా టీజర్ను 11వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా పోస్టర్ తో సహా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో పాటు ఒక తమిళ్, ఒక మలయాళం బాషా మూవీలలో నటిస్తున్న ఈమె అలాగే విజయ్ సేతుపతి మూవీలో కూడా నటిస్తోంది. మొత్తానికి అయితే ఒకవైపు వరుస ప్రాజెక్టులలో నటిస్తూనే మరొకవైపు ఇలా గ్లామర్ వలకబోస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
