Begin typing your search above and press return to search.

సంయుక్త 'బ్లాక్‌ గోల్డ్‌' కథ ఏంటో..!

మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ టాలీవుడ్‌లో ఒక్కసారిగా బిజీ అయింది. ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపు అర డజను తెలుగు సినిమాలు ఉండటం విశేషం.

By:  Ramesh Palla   |   15 Oct 2025 3:40 PM IST
సంయుక్త బ్లాక్‌ గోల్డ్‌ కథ ఏంటో..!
X

మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ టాలీవుడ్‌లో ఒక్కసారిగా బిజీ అయింది. ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపు అర డజను తెలుగు సినిమాలు ఉండటం విశేషం. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలను సైతం ఈమె చేస్తోంది. సంయుక్త మీనన్‌ చివరగా 2023లో డెవిల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది లవ్‌ మీ సినిమాలో నటించినప్పటికీ అది గెస్ట్‌ అప్పియరెన్స్ మాత్రమే. అంటే దాదాపు రెండేళ్లుగా సంయుక్త మీనన్‌ నటించిన సినిమాలు రాలేదని చెప్పాలి. ఆ గ్యాప్‌ను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంయుక్త మీనన్‌ ఫిల్‌ చేసే విధంగా వరుస సినిమాలకు కమిట్‌ అయింది. ప్రస్తుతం ఈమె చేతిలో అఖండ 2, స్వయంభూ సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాను కూడా సంయుక్త చేస్తుంది.

యోగి దర్శకత్వంలో సంయుక్త మీనన్‌

తెలుగులో ఈమె కొత్తగా యోగి దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్‌ అయింది. చాలా ఏళ్ల క్రితం వెంకటేష్ హీరోగా వచ్చిన చింతకాయల రవి సినిమాకు దర్శకత్వం వహించిన యోగి మళ్లీ ఇన్నాళ్లకు ఒక లేడీ ఓరియంటెడ్‌ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్‌ నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయిందని, దాదాపుగా సగం షూటింగ్‌ పూర్తి అయిందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. తాజాగా ఈ సినిమాకు బ్లాక్‌ గోల్డ్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైటిల్‌కి తగ్గట్లుగా ఈ సినిమా కథాంశం ఉంటుందని, సినిమాకు ఈ టైటిల్‌ సరైన నిర్ణయం అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. అందుకే ఈ టైటిల్‌ విషయంలో మేకర్స్‌ తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

బ్లాక్‌ గోల్డ్‌ సినిమాలో సంయుక్త మీనన్‌

బ్లాక్‌ గోల్డ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్‌ చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సంయుక్త ఇప్పటి వరకు పోషించిన పాత్రలతో పోల్చితే ఈ సినిమాలోని పాత్ర చాలా విభిన్నంగా, వైవిధ్యభరితంగా ఉంటుందని అంటున్నారు. పైగా సంయుక్త మీనన్‌ గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా బలమైన పాత్రలో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే విధంగా ఈ లేడీ ఓరియంటెడ్‌ మూవీ ఉంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. బ్లాక్ గోల్డ్‌ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌ లేదా అంతకంటే ముందే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు గతంలో భైరవి లేదా రాక్షసి అనే టైటిల్‌ను అనుకున్నారు. చివరకు బ్లాక్ గోల్డ్‌ టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేశారని యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

పవన్‌ కళ్యాణ్ సినిమాతో తెలుగులో...

భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ మలయాళి ముద్దుగుమ్మ 2016లో పాప్‌కార్న్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. షైన్‌ టామ్ చాకో సరసన నటించడం ద్వారా గుర్తింపు దక్కించుకుంది. మొదటి సినిమాలోనే ఆమె గర్భిణీ పాత్రను పోషించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. సంయుక్త మీనన్‌ సెప్టెంబర్‌ 11, 1995 న జన్మించింది. కేరళలోని పాలక్కడ్‌ లో జన్మించింది. ఆమె తత్తమంగళంలోని చిన్మయ విద్యాలయంలో పాఠశాల విద్యను అభసించింది. ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్‌ పట్టాను ఈ అమ్మడు దక్కించుకుంది. చదువులో మంచి ప్రతిభను కనబర్చుతూనే సినిమాల్లోనూ ఈమె నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. రాబోయే రోజుల్లో సంయుక్త మీనన్‌ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు రానున్న నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్‌కి ఫుల్‌ పండుగే.