Begin typing your search above and press return to search.

హీట్ పెంచిన సంయుక్త.. అందాలతో అదరహో అనిపిస్తూ!

ఇటీవల కాలంలో హీరోయిన్స్ ఒకరి తర్వాత ఒకరు సోషల్ మీడియాలో గ్లామర్ వలకబోస్తూ తమ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.

By:  Madhu Reddy   |   13 Feb 2026 11:03 PM IST
హీట్ పెంచిన సంయుక్త.. అందాలతో అదరహో అనిపిస్తూ!
X

ఇటీవల కాలంలో హీరోయిన్స్ ఒకరి తర్వాత ఒకరు సోషల్ మీడియాలో గ్లామర్ వలకబోస్తూ తమ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అందులో భాగంగానే తన అందంతో, అమాయకత్వంతో ఒకప్పుడు కట్టు బొట్టుతో సాంప్రదాయంగా కనిపించిన హీరోయిన్స్.. ఇప్పుడు ఏకంగా గ్లామర్డోస్ పెంచేసి హీట్ పుట్టిస్తూ అందాలతో అదరహో అనిపిస్తుంది .ఆమె ఎవరో కాదు అందాల తార సంయుక్త మీనన్. పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో రానా సరసన హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత బింబిసారా సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి మెప్పించింది.




ఇక ఈ మధ్యకాలంలో వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న సంయుక్త మీనన్.. తాజాగా గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలను పంచుకుంది. స్లీవ్ లెస్.. ఫ్రంట్ డీప్ వీక్ కలిగిన బ్లాక్ అనార్కలి డ్రెస్ ధరించిన ఈమె అందులో సైడ్ కట్ అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎప్పుడు చీరకట్టులో కనిపించే సంయుక్త మీనన్ ఇలా హీట్ పెంచుతోంది ఏంటి అంటూ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే సంయుక్త మీనం షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన అభిమానులు.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఒక అభిమాని అడిగితే.. ఇంకొకరు నీ అందానికి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇలా ఈమె అందాలపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.




సంయుక్త మీనన్ చివరిగా తెలుగులో శర్వానంద్ తో కలిసి నారి నారి నడుమ మురారి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇందులో సాక్షి వైద్య మరో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా సరైన థియేటర్లు దొరకక కలెక్షన్లు సొంతం చేసుకోలేదు కానీ కంటెంట్ పరంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటు అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీ స్ట్రీమింగ్ కి కూడా వచ్చేసింది. ఇక్కడ ఆడియన్స్ను అలరిస్తున్నట్లు సమాచారం.

సంయుక్త తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న స్వయంభూ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. హిస్టారికల్ జానర్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. మరొకవైపు విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది. అంతేకాదు ది బ్లాక్ గోల్డ్ అనే ఉమెన్ సెంట్రిక్ యాక్షన్ మూవీలో కూడా సంయుక్త నటిస్తోంది. ఒకవైపు వరుస చిత్రాలతో బిజీగా ఉంటూనే మరొకవైపు ఆడియన్స్ ను అలరించడానికి ఇలా సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది సంయుక్త.