Begin typing your search above and press return to search.

అలలతో ఆడుకుంటూ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న సంయుక్త!

ఈ క్రమంలోనే తాజాగా సంయుక్త మేనన్ కూడా వెకేషన్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది. అక్కడ అలలతో ఆడుకుంటూ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

By:  Madhu Reddy   |   29 Sept 2025 2:28 PM IST
అలలతో ఆడుకుంటూ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న సంయుక్త!
X

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు బిజీ షెడ్యూల్స్ కారణంగా అటు ఫ్యామిలీకి కూడా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు మరి కొంతమంది అలా టైం దొరికితే చాలు ఇలా వెకేషన్స్ కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.. ముఖ్యంగా ఫ్యామిలీతో లేదా స్నేహితులతో లేదా తమకు బాగా కావలసిన వాళ్లతో వెకేషన్స్ కి వెళ్లి స్ట్రెస్ ను తగ్గించుకుంటున్న విషయం తెలిసిందే. ఇంకొంతమంది ఒంటరిగానే తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోతూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సంయుక్త మేనన్ కూడా వెకేషన్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది. అక్కడ అలలతో ఆడుకుంటూ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా విశాఖపట్నంకి వెకేషన్ కి వెళ్ళిన ఈమె అక్కడ బీచ్ లో సముద్రపు అలలను ఆస్వాదిస్తున్న క్షణాలను ఫోటోల రూపంలో బంధించి అభిమానులతో పంచుకుంది. ఇక్కడ బికినీ, డిజైనర్ దుస్తులను ఎంచుకోకుండా డెనిమ్ ప్యాంట్ తో కూడిన బేసిక్ గ్రే షర్టును ధరించి.. తడి ఇసుక మీద తడిసిన దుస్తులతో కూర్చొని రిలాక్స్ గా ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ఈ దుస్తుల్లో తనకంటూ ఒక ప్రత్యేక ఆకర్షణను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రశాంతమైన బీచ్ మోడ్ కి భిన్నంగా తన ఆటలతో కేరింతలు కొడుతూ అలలతో ఆడుకుంటూ కనిపించింది. ఇకపోతే సింపుల్ లుక్ కూడా అందరికీ చాలా కొత్తగా అనిపిస్తుంది అనేలా తన సింపుల్ మేకోవర్తో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే అలల తాకిడికి చిన్నపిల్ల అయిపోయి చూసే చూపరులను కూడా ఆకట్టుకుంది సంయుక్త మేనన్ . ప్రస్తుతం సంయుక్త కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక సంయుక్త మీనన్ సినిమాల విషయానికి వస్తే.. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2 తాండవం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అలాగే పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న ' స్లమ్ డాగ్ ' అనే మూవీలో కూడా ఈమె నటిస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.

సంయుక్త మీనన్ కెరియర్ విషయానికి వస్తే.. రానా దగ్గుబాటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ధనుష్ హీరోగా వచ్చిన బైలింగ్వల్ మూవీ సార్ మూవీలో కూడా హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది సంయుక్త మీనన్. ఇక ఇటీవల వచ్చిన విరూపాక్షా సినిమాతో అద్భుతమైన నటన కనబరిచి ఆకట్టుకున్న ఈమె మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏది ఏమైనా సంయుక్త ఇప్పుడు అందరిలో అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు.