సెల్ఫీలతో కాకలు పుట్టిస్తున్న గోల్డెన్ లెగ్
తాజాగా విడుదలైన ఒక ఫోటోలో ఈ భామ `స్లీవ్‌లెస్ స్టైలిష్ బ్లాక్ కటౌట్` డ్రెస్‌లో కనిపిస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.
By: Sivaji Kontham | 12 April 2026 11:48 AM ISTమలయాళ కుట్టి సంయుక్త మీనన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గ్లామరస్ సెల్ఫీలతో సెగలు పుట్టిస్తోంది. తాజాగా విడుదలైన ఒక ఫోటోలో ఈ భామ `స్లీవ్‌లెస్ స్టైలిష్ బ్లాక్ కటౌట్` డ్రెస్‌లో కనిపిస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. ఈ బాడీకాన్ డ్రెస్‌లో నడుము భాగంలో ఉన్న కటౌట్ సంయుక్త మెరుపు తీగలాంటి సోయగాన్ని.. ట్రెండీ ఫ్యాషన్ సెన్స్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. మెరిసే మేకప్, సింపుల్ హెయిర్ స్టైల్‌తో అద్దం ముందు నిలబడి సెల్ఫీకి ఫోజులిచ్చిన తీరు సంయుక్త ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ సెల్ఫీలు వెబ్ లో కాకలు పుట్టిస్తున్నాయి. యువతరం సోషల్ మీడియాల్లో వైరల్ గా షేర్ చేస్తున్నారు.
సంయుక్త మీనన్ కెరీర్ ఎదుగుదల టాలీవుడ్‌లో ఒక సంచలనం అనే చెప్పాలి. మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా ప్రయాణం మొదలుపెట్టిన ఈ భామ అతి తక్కువ సమయంలోనే తెలుగు -తమిళ ప్రేక్షకులకు చేరువయ్యారు. ముఖ్యంగా తెలుగులో ఈ భామ నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్ వంటి చిత్రాలు వరుసగా భారీ విజయాలను అందుకోవడంతో `గోల్డెన్ లెగ్ బ్యూటీ`గా పాపులరైంది. ప్రతి సినిమాలోనూ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్‌లలో ఒకరిగా ఎదిగారు.
ప్రస్తుతం సంయుక్త చేతిలో కొన్ని ఆసక్తికరమైన పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. సంయుక్త మీనన్ ఆశలన్నీ ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ సరసన నటిస్తున్న `స్వయంభు` చిత్రంపైనే ఉన్నాయి. పీరియాడికల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల ఆలస్యం కావడంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. భారీ బడ్జెట్- అత్యున్నత స్థాయి గ్రాఫిక్స్ (వీఎఫ్ఎక్స్) పనులు ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతోంది. అలాగే కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో మార్పులు చేయడం కూడా ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం సంయుక్త ఎంతో ఓపికగా ఎదురుచూస్తోంది.
`స్వయంభు` సినిమా సంయుక్త కెరీర్‌లో అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే ఇందులో నటనకు ప్రాధాన్యత ఉన్న ఒక వైవిధ్యమైన పాత్ర దక్కింది. ఈ చిత్రం తో తన నటనా పరిధిని మరోసారి విస్తరించాలని.. ప్యాన్ ఇండియా స్థాయిలో తన ముద్ర వేయాలని ఆశిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం కచ్చితంగా కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న సంయుక్త, ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.
సంయుక్త మీనన్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత బిజీ దశలో ఉన్నారు. అన్ని ముఖ్యమైన భాషల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. హిందీ చిత్రం `మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్`లో మోహిని అనే కీలక పాత్రలో నటిస్తూ బాలీవుడ్ అరంగేట్రం చేస్తుండగా.. మలయాళంలో మోహన్ లాల్ సరసన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `రామ్` లో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. అటు తమిళంలో రాఘవ లారెన్స్ నటిస్తున్న `బెంజ్` చిత్రంలోనూ.. అలాగే క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే `స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్` వంటి విభిన్న ప్రాజెక్టులలో నటిస్తున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. నటనకు ప్రాధాన్యమున్న ఇటువంటి వైవిధ్యభరితమైన సినిమాలతో 2026లో పాన్ ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేయాలని ఆశిస్తున్నారు.
