Begin typing your search above and press return to search.

'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్.. ఎలా ఉందంటే?

టాలీవుడ్‌ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు మళ్ళీ క్రేజ్ పెరుగుతున్న వేళ.. ఎంటర్టైన్మెంట్ తో పాటు క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్ తో వస్తున్న తాజా చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని.

By:  M Prashanth   |   2 March 2026 1:26 PM IST
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్.. ఎలా ఉందంటే?
X

టాలీవుడ్‌ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు మళ్ళీ క్రేజ్ పెరుగుతున్న వేళ.. ఎంటర్టైన్మెంట్ తో పాటు క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్ తో వస్తున్న తాజా చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. మార్చి 6వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ ఉంది. హీరోగా నటిస్తూ.. నిర్మాతగా సీనియర్ యాక్టర్ శివాజీ వ్యవహరిస్తుండగా, చాలా కాలం తర్వాత ఆయన సరసన లయ కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.





విడుదల బాధ్యతలను ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి తీసుకోవడం విశేషం. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ ఒరిజినల్ గా రూపొందుతున్న ఆ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా.. అందరినీ ఆకట్టుకుంటోంది. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ కథను సరదాగా, వేగంగా నడిపిస్తూ కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ను యాడ్ చేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది.

తాజాగా విడుదలైన ట్రైలర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచే నవ్వులు పూయిస్తుంది. రోహన్ మీమ్ స్టైల్ సీన్ తో మొదలయ్యే గ్లింప్స్.. ఓ సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ చుట్టూ తిరుగుతుంది. భార్యాభర్తల మధ్య జరిగే సరదా తగాదాలు, చిన్న చిన్న గొడవలతో కథ మొదలవుతుంది. అయితే లయ తన భర్త శివాజీని లంచం తీసుకోవాలని ఒత్తిడి చేయడం కథను ఒక్కసారిగా కొత్త మలుపు తిప్పుతుంది.

అక్కడి నుంచి శివాజీ, లయ జర్నీ మొదలై పోలీసులు, గూండాల బెడద, అనుకోని సంఘటనలతో కథ ముందుకు సాగుతుంది. నార్మల్ సిచువేషన్ ఎలా గందరగోళంగా మారుతుందో దర్శకుడు కామెడీతో చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భార్య, కొడుకు వల్ల శివాజీ చిక్కుల్లో పడటం, దాని వల్ల వచ్చే ఇబ్బందులు ట్రైలర్‌ కు హైలైట్‌ గా నిలిచాయి.

లయ పాత్ర సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. క్రేజీగా డిజైన్ చేసిన ఆమె రోల్ లో ఎనర్జీ, అల్లరి, ఇంట్రెస్టింగ్ ట్విస్టులు కనిపిస్తున్నాయి. శివాజీ- లయ జంట మధ్య కెమిస్ట్రీ పాత రోజుల్ని గుర్తు చేస్తూ, ప్రేక్షకులకు వింటేజ్ ఫీలింగ్‌ ను ఇస్తోంది. కామెడీ పరంగా సినిమా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ప్రముఖ నటుడు అలీ, కామెడీ స్టార్ ధనరాజ్, ఇమ్మాన్యుయేల్ తమ టైమింగ్‌ తో నవ్వులు పంచేలా ఉన్నారు. వీరి సన్నివేశాలు ట్రైలర్‌ కు ఎక్స్ట్రా జోష్ తెచ్చాయి.

ఎనర్జిటిక్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, క్లీన్ అండ్ క్లియర్ ఎడిటింగ్, స్పీడ్ నేరేషన్ ట్రైలర్‌ ను మరింత ఎంగేజింగ్‌ గా మార్చాయి. ఏదేమైనా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ నవ్వులు, థ్రిల్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన పక్కా థియేట్రికల్ ఎంటర్టైనర్‌ గా ఉండనున్నట్లు కనిపిస్తోంది. మరి మార్చి 6న థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఆ మూవీ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.