Begin typing your search above and press return to search.

శర్వానంద్‌పై డైరెక్టర్ సంపత్ నంది ప్రశంసలు.. ఏమన్నారంటే?

‘భోగి’లో శర్వానంద్‌ను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించానని దర్శకుడు సంపత్ నంది తెలిపారు. శర్వా నటనకు నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు కష్టపడ్డానని, అన్నాచెల్లెళ్ల అనుబంధం, యాక్షన్‌కు ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడించారు. నవంబర్ 27న ‘భోగి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

By:  Madhu Reddy   |   23 Nov 2026 1:42 PM IST
శర్వానంద్‌పై డైరెక్టర్ సంపత్ నంది ప్రశంసలు.. ఏమన్నారంటే?
X

నవంబర్ 27న రాబోతున్న ‘భోగి’ సినిమా ఫ్రీ రిలీజ్ సంపత్ నంది చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతున్నాయి. మామూలుగా ఈవెంట్లలో హీరోలను పొగడటం కామనే కానీ, ఇక్కడ డైరెక్టర్ మాటల్లో ఒక కసి, తన కథ మీద ఒక బలమైన నమ్మకం కనిపిస్తోంది. శర్వానంద్‌ను ఎందుకు ఎంచుకున్నాడు, అతనిలో ఏం చూశాడో సంపత్ మాటల్లోనే చూద్దాం.

శర్వానంద్‌నే ఎందుకు ఎంచుకున్నాడు?:

పెద్ద యాక్షన్ సినిమా కదా, నాతో ఎందుకు అని శర్వానంద్ అడిగితే.. సౌత్‌లో నాకు నచ్చే ఇద్దరు ముగ్గురు యాక్టర్లలో నువ్వు ఒకడివని సంపత్ చెప్పాడు. వాళ్లు నవ్వితే మనకు నవ్వాలి, ఏడిస్తే మనకు ఏడవాలి అనిపిస్తుందని, అలాంటి ఎమోషన్ ఉన్న యాక్టర్ కాబట్టే ఈ కథకు శర్వానే ఫిక్స్ అయ్యానని అన్నాడు. వేరే ఏ హీరోకి ఈ కథ చెప్పలేదంటే ఆ నమ్మకం ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది.

కంఫర్ట్ జోన్ దాటిన శర్వా:

ఇప్పటివరకు మనం చూసిన శర్వానంద్ వేరు, ఈ సినిమాలో కనిపించే శర్వా వేరు అని సంపత్ క్లారిటీ ఇచ్చాడు. ఒకవైపు అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్, మరోవైపు బానిసత్వాన్ని ఎదిరించే యాక్షన్.. ఈ రెండింటి మధ్య శర్వాలోని మరో కోణాన్ని బయటకు తీశాడట. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లలో అతని యాక్టింగ్ వేరే లెవల్‌లో ఉంటుందని ఊరిస్తున్నాడు.

నేషనల్ అవార్డు మాట వెనుక లెక్క:

శర్వాకు నేషనల్ అవార్డు రావాలని సంపత్ కోరుకోవడం వెనుక అతని పెర్ఫార్మెన్స్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. సినిమా చూసిన తర్వాత శర్వా ఫోన్ చేసి "అమ్మ జన్మనిస్తే, మీరు మరో జన్మనిచ్చారు" అన్నాడంటే, ఆ క్యారెక్టర్ అతనికి ఎంతలా కనెక్ట్ అయిందో తెలుస్తోంది. డైరెక్టర్‌కు ఇలాంటి మాట కంటే ఇంకేం కావాలి?

మూడేళ్ల కష్టం వర్కవుట్ అవుతుందా?:

ఈ సినిమా కోసం సంపత్ మూడేళ్లు రోజుకు 14 నుంచి 16 గంటలు పనిచేశానని చెప్పాడు. అనుపమ, డింపుల్, పర్శి గ్యాంగ్ ఇలా అందరినీ వాడుకున్న తీరు చూస్తుంటే ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు, ఎమోషనల్ డ్రామా అని అర్థమవుతుంది. బొగ్గులకుంట కథ ఆడియన్స్‌కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేదే అసలు పాయింట్.

మాటలకే పరిమితమా? మ్యాజిక్ చేస్తుందా?:

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ చెప్పినంత ఎమోషన్, యాక్షన్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తే సినిమా నిలబడుతుంది. శర్వానంద్‌కు కూడా మంచి హిట్ చాలా అవసరం. మరి ఈ ‘భోగి’ మంటల్లో పాత కష్టాలు కాలిపోయి, కొత్త విజయం వస్తుందో లేదో నవంబర్ 27న తేలిపోతుంది!