తేజ్ టు గోపీచంద్ వయా శర్వానంద్..!
ఇంతకీ ఇది ఏ సినిమా గురించి అనే కదా మీ డౌట్.. అక్కడికే వచ్చేద్దాం.
By: Ramesh Boddu | 3 Oct 2025 1:53 PM ISTకొన్ని సినిమాలు ఒకరి కోసం అనుకుని మరొకరి కోసం మొదలు పెట్టి మరొకరి దగ్గరకు వెళ్తుంటాయి. ఐతే ఫాం లో లేని డైరెక్టర్ అనో.. బడ్జెట్ ఎక్కువ అవుతుందనో కానీ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే ఇద్దరు హీరోలతో ఓకే చేయించుకుని దాదాపు అనౌన్స్ మెంట్ ఇంకా గ్లింప్స్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ వేరే హీరో దగ్గరకు వెళ్లిందట. ఇలాంటివి ఇంతకుముందు జరగలేదా అంటే మరీ సినిమా ఓకే చేసుకుని గ్లింప్స్ వదిలాక హీరో మార్పు జరగడం చాలా అరుదు అని చెప్పొచ్చు.
మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది..
ఇంతకీ ఇది ఏ సినిమా గురించి అనే కదా మీ డౌట్.. అక్కడికే వచ్చేద్దాం. మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది మెగా పవర్ స్టార్ తో రచ్చ సినిమా చేశాడు. ఆ టైం లో అతనికి అది పెద్ద ఛాన్స్ ఆ తర్వాత ఏమైందో ఏమో గబ్బర్ సింగ్ 2 ఛాన్స్ వచ్చినట్టె వచ్చి చేజారింది. నెక్స్ట్ గోపీచంద్ తో వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. గౌతమ్ నంద, సీటీమార్ రెండు నిరాశపరిచాయి. ఇక డైరెక్టర్ గా గ్యాప్ ఇచ్చి నిర్మాతగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు సంపత్ నంది.
ఐతే సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ సినిమా ఒకటి అనౌన్స్ మెంట్ వచ్చింది. సాయి ధరం తేజ్ హీరోగా ఆ సినిమా ప్రకటించారు. కానీ ఏమైందో ఏమో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఇక కొద్దిపాటి గ్యాప్ తోనే సంపత్ నంది శర్వానంద్ తో భోగి సినిమా అనౌన్స్ చేశాడు. ఆ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. భోగి అనౌన్స్ మెంట్ టీజర్ ఇంప్రెస్ చేసింది.
శర్వానంద్ తో చేద్దాం అనుకున్న భోగి..
శర్వానంద్ తో చేద్దాం అనుకున్న భోగికి కూడా బ్రేక్ పడిందట. కొన్ని అనివార్య కారణాల వల్ల హీరో శర్వానంద్ ప్లేస్ లో సంపత్ నంది గోపీచంద్ తోనే ఈ సినిమా తీసే ప్లానింగ్ తో ఉన్నారట. కె.కె రాధామోహన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మరి సంపత్ నంది సినిమా ఇలా ఇద్దరు దర్శకుల దగ్గర నుంచి మూడో హీరో దగ్గరకు రావడం సర్ ప్రైజింగ్ గా ఉంది. గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డితో ఒక సినిమా చేస్తున్నాడు. సంపత్ నందితో ఆల్రెడీ గోపీచంద్ మంచి ర్యాపో ఉంది కాబట్టి ఈ సినిమా ఎలాంటి హైప్ ఎక్కిస్తుందో చూడాలి.
