డిలే భారాన్ని సంక్రాంతి మోయగలదా
సాయి దుర్గా తేజ్ నటిస్తున్న 'సంబరాల ఏటిగట్టు' సినిమాను ఇంకా ఎంత కాలం సాగదీస్తారు అనే టాక్ అయితే ఉంది. మొదట్లో ఈ మూవీని 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
By: M Prashanth | 18 Aug 2026 8:00 AM ISTసాయి దుర్గా తేజ్ నటిస్తున్న 'సంబరాల ఏటిగట్టు' సినిమాను ఇంకా ఎంత కాలం సాగదీస్తారు అనే టాక్ అయితే ఉంది. మొదట్లో ఈ మూవీని 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ డేట్ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ఈ ఏడాది జూన్ లో ఒక అప్డేట్ ఇస్తూ 2026 డిసెంబర్ లో థియేటర్లలోకి తీసుకొస్తామని చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా 2027 జనవరి 12కి వాయిదా వేశారు.
ఫైనల్ గా సినిమాను సంక్రాంతి బరిలో దించుతున్నారు. పండగ సీజన్ దొరకడం పెద్ద ప్లస్ పాయింట్ అయినా, ఇన్నాళ్ల డిలేని సంక్రాంతి అడ్వాంటేజ్ ఒక్కటే బ్యాలెన్స్ చేయగలదా అనే డౌట్ వస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి రేసు ఇప్పటికే టైట్ అయిపోయింది. జనవరి 8న మహాకాళి థియేటర్లలోకి వస్తుంటే, శర్వానంద్ శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన జార్జ్ క్రిష్ జనవరి 14న రాబోతోంది. నాగార్జున కూడా సడన్ సర్ ప్రైజ్ ఇవ్వచ్చు. వీటికి తోడు వెంకటేష్ కళ్యాణ్ రామ్ లతో అనిల్ రావిపూడి చేస్తున్న మల్టీస్టారర్ సినిమా కూడా పండగనే టార్గెట్ చేసింది.
రిలీజ్ టైమ్ కి వీటిలో ఎన్ని సినిమాలు రేసులో నిలబడతాయో ఇప్పుడే చెప్పలేం కానీ, బాక్సాఫీస్ దగ్గర మాత్రం గట్టి ఫైట్ తప్పదనే విషయం క్లియర్ గా తెలుస్తోంది. సంబరాల ఏటిగట్టు టీమ్ కు ఉన్న అసలు సమస్య రిలీజ్ డేట్ ఒక్కటే కాదు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, క్యారెక్టర్ పోస్టర్లు ఎప్పుడో బయటకు వచ్చేశాయి. మధ్యలో ఇలా పదే పదే రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంటే జనాల్లో ఆటోమేటిక్ గా ఆసక్తి తగ్గిపోతుంది.
జనవరి వచ్చేసరికి ఇది ఎప్పటినుంచో నానుతున్న సినిమా అనే ఫీలింగ్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడే చూడాల్సిన ఫ్రెష్ మూవీ అనే వైబ్స్ క్రియేట్ చేయాలి. దానికి తగ్గట్టుగానే మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్ ను చాలా కొత్తగా డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పండగ సీజన్ అనగానే బిజినెస్ పరంగా రేట్లు పెంచి అమ్ముకునే ఆస్కారం ఉంటుంది.
అయితే ఇప్పటికే చాలా డిలే అయిన ప్రాజెక్ట్ కావడంతో, సంక్రాంతి పేరు చెప్పి థియేట్రికల్ టార్గెట్ ను అమాంతం పెంచేస్తే అసలుకే మోసం వస్తుంది. ఒకేసారి ఐదారు సినిమాలు థియేటర్లలో ఉన్నప్పుడు కచ్చితంగా స్క్రీన్స్ పంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు సినిమా టాక్ కాస్త అటూ ఇటూగా ఉన్నా కలెక్షన్స్ రికవర్ చేసుకోవడానికి టైమ్ దొరకదు. కాబట్టి రేట్ల విషయంలో మేకర్స్ జాగ్రత్తగా అడుగులు వేయాలి.
వరుస సెలవులు ఉండటం, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడం వల్ల మంచి టాక్ వస్తే రెండో రోజు నుంచే కలెక్షన్స్ పికప్ అవుతాయి. ఈ సినిమా కోసం సాయి దుర్గా తేజ్ తన లుక్, ఫిజిక్ ను పూర్తిగా మార్చేశాడు. ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్ లాంటి స్ట్రాంగ్ కాస్టింగ్ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఉంది. కాబట్టి సినిమాలో కంటెంట్ పరంగా కావాల్సినంత స్టఫ్ ఉందనే చెప్పాలి.
