12th ఫెయిల్ నటి మేధా శంకర్‌తో సమయ్ రైనా పెళ్లి?
బాలీవుడ్ కమెడియన్ సమయ్ రైనా- `12th ఫెయిల్` ఫేమ్ నటి మేధా శంకర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 21 Sept 2026 3:05 PM ISTబాలీవుడ్ కమెడియన్ సమయ్ రైనా- `12th ఫెయిల్` ఫేమ్ నటి మేధా శంకర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది డిసెంబర్‌లో ఇద్దరి వివాహం జరగనుందని నెట్టింట వార్తలు రాడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ డేటింగ్ పుకార్లపై సమయ్ రైనా తనదైన శైలిలో హాస్యాస్పందంగా స్పందించారు. పెళ్లి వార్తలకు సంబంధించిన పోస్ట్‌ను షేర్ చేస్తూ చమత్కారంగా కౌంటర్ ఇచ్చారు.
`డిసెంబర్‌లో నా ఇండియా టూర్ ఉంది.. క్షమించాలి మేధా మనం పెళ్లిని వాయిదా వేసుకోవాల్సిందే` అంటూ లతా మంగేష్కర్ పాడిన `జూట్ బోలే కౌవా కాటే` పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో జోడించారు. సమయ్ చేసిన సరదా కామెంట్‌కు మేధా శంకర్ కూడా నవ్వుతున్న ఎమోజీలతో స్పందించారు. నటి మేధా శంకర్ కూడా ఈ పెళ్లి పుకార్లను కొట్టిపారేశారు. మంచంపై పడుకున్న చిన్న దూడ ఫోటోను షేర్ చేస్తూ `ఆధారం లేని పెళ్లి వార్తలను చూసినప్పుడు నా రియాక్షన్ ఇదిగో ఇలాగే ఉంటుంది` అంటూ రాసుకొచ్చారు. దీనికి `వెల్కమ్` చిత్రంలోని `కియా కియా` పాటను జత చేస్తూ ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
గతంలో ఇద్దరు కలిసి ఒక పార్టీలో కనిపించడం పిక్స్ షేర్ చేయడంతో ఇద్దరి మధ్య డేటింగ్ నడుస్తోందనే ప్రచారం మొదలైంది. అటుపై సమయ్ రైనా నిర్వహిస్తున్న ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో మేధా జడ్జీగా కనిపించడంతో పుకార్లకు మరింత బలం చేకూరింది. ఇటీవల ఇద్దరి వెకేషన్ ఫోటోల బ్యాక్‌గ్రౌండ్స్ ఒకేలా ఉండటంతో అభిమానులు ప్రేమలో ఉన్నారని భావించారు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని జంట క్లారిటీ ఇచ్చారు.
దీంతో అన్ని రకాల ప్రచారాలకు శాశ్వతంగా ముగింపు పలికినట్లు అయింది.
వర్క్ విషయానికి వస్తే మేధా శంకర్ ప్రస్తుతం లక్ష్మణ్ ఉట్టేకర్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న డిటెక్టివ్ కామెడీ చిత్రంలో సన్నీ కౌశల్, నిమ్రత్ కౌర్‌లతో కలిసి నటిస్తున్నారు. మరోవైపు సమయ్ రైనా తన `ఇండియాస్ గాట్ లాటెంట్ సీసన్ 2` తోపాటు ఇండియా టూర్‌తో బిజీగా ఉన్నారు.
