Begin typing your search above and press return to search.

ఏ మాయ చేసావే రోజులను గుర్తుచేసిన సమంత.. జెస్సీ లుక్ లో అదరహో!

ఏ మాయ చేసావే.. ఇది సినిమా మాత్రమే అనుకుంటే పొరపాటే.. 2010లో అటు అబ్బాయిలను ఇటు అమ్మాయిలను విపరీతంగా ఆకట్టుకున్న రొమాంటిక్ డ్రామా మూవీ ఇది.

By:  Madhu Reddy   |   5 Jun 2026 11:08 AM IST
ఏ మాయ చేసావే రోజులను గుర్తుచేసిన సమంత.. జెస్సీ లుక్ లో అదరహో!
X

ఏ మాయ చేసావే.. ఇది సినిమా మాత్రమే అనుకుంటే పొరపాటే.. 2010లో అటు అబ్బాయిలను ఇటు అమ్మాయిలను విపరీతంగా ఆకట్టుకున్న రొమాంటిక్ డ్రామా మూవీ ఇది. నాగచైతన్య , సమంత కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాను ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంజుల ఘట్టమనేని నిర్మించగా.. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ రచనా దర్శకత్వంలో వచ్చిన ఒక ఆణిముత్యం అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో జెస్సీ పాత్రలో సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతేకాదు ఈమెకు ఈ సినిమా మొదటిదే అయినా తన అద్భుతమైన నటనతో లుక్ తో విపరీతంగా యువతకు క్రష్ గా మారిపోయింది.

2010 లో సినిమా వచ్చినా.. ఈ సినిమా వచ్చి పదహారేళ్ల అవుతున్నా ఇప్పటికీ జెస్సీ పాత్రను అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా మరిచిపోలేదు అంటే ఆ పాత్ర జనాలపై ఏ విధంగా ఎఫెక్ట్ చూపిందో అర్థం చేసుకోవచ్చు..అయితే ఈ సినిమాలోని జెస్సీ ను ఇప్పుడు మళ్లీ గుర్తు చేసింది సమంత.

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా సమంత.. నందిని రెడ్డి దర్శకత్వంలో నాలుగవసారి చేస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. సమంత సొంత నిర్మాణ బ్యానర్ అయిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ సమర్పణలో ఆమె భర్త , ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరు.. హిమాంక తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఒకవైపు ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టింది సమంత. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడిపేస్తోంది..

అలా నిన్న జరిగిన ప్రమోషన్స్ లో శారీ, లూస్ హెయిర్ తో ఆకట్టుకుంది. ఇది చూసి ఏ మాయ చేసావే లోని జెస్సీ పాత్ర గుర్తొస్తోంది అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. స్కై బ్లూ కలర్ సారీ కి ఎల్లో గోల్డెన్ మిక్స్ కలర్ బ్లౌజ్ ధరించి లూస్ హెయిర్ తో సింపుల్ మేకప్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. మెడలో చిన్న లాకెట్ కలిగిన చెయిన్ ధరించి జెస్సీ పాత్రను గుర్తుచేసింది. అమాయకంగా .. కాస్త స్టైలిష్ గా అలా నడుస్తూ వస్తుంటే.. జెస్సీ మళ్ళీ తిరిగి వచ్చింది అంటూ అభిమానులు ప్రమోషనల్ కార్యక్రమాలలో తెగ సందడి చేశారు.అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు ప్రతి ఒక్కరు సమంతతో కలిసి సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు కూడా.. ఏదేమైనా 16 ఏళ్ల నాటి పాత్రను మళ్ళీ గుర్తుచేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది సమంత.

విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ఖుషీ సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ తెలుగులో ఆమె చేస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ,పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో హోమ్లీగా గృహిణిగా కనిపిస్తూనే మరొకవైపు తన యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టడానికి సిద్ధమయింది. ఇక ఇందులో సమంతతో పాటు ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా సమంతకు తోడికోడలు పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం.జూన్ 19వ తేదీన మా ఇంటి బంగారం కాస్త థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. మరి ఈ సినిమాతో సమంత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.