నిన్న అహంకారి.. నేడు విలన్.. సమంత స్టైలిస్ట్ షాకింగ్ పోస్ట్!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు రెండవసారి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది.
By: Madhu Reddy | 2 Dec 2025 12:32 PM ISTప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు రెండవసారి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న ఈమె మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. డిసెంబర్ ఒకటి అనగా నిన్న సోమవారం ఉదయం కోయంబత్తూర్ లోని ఈశా యోగా కేంద్రం వద్ద ఉన్న లింగ బైరవి సన్నిధిలో అమ్మవారి విగ్రహం ముందు భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ అధికారికంగా తమ పెళ్లి విషయాన్ని ప్రకటించింది సమంత.
ఇకపోతే సమంత రెండవ పెళ్లి చేసుకోవడంపై పలువురు సినీ సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా.. మరికొంతమంది మాత్రం ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటే వాటిని సమంతాకు ఆపాదిస్తూ ఉండడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. నిన్న పూనమ్ కౌర్.. ఈరోజు సమంతకు గతంలో పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ గా పనిచేసిన సద్నా సింగ్ పోస్టులు పెట్టడంతో.. ఇవి సమంతను ఉద్దేశించి పెట్టినవే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ప్రముఖ నటి పూనమ్ కౌర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. "సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం చాలా బాధాకరం. బలహీనమైన, నిస్సహాయ పురుషులను డబ్బుతో కొనుగోలు చేయవచ్చు. ఈ అహంకార పూరిత మహిళను పెయిడ్ పీ ఆర్ టీమ్ చాలా గొప్ప వారిగా చూపిస్తున్నారు " అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. అయితే ఆమె ఇది ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టిందో తెలియదు కానీ.. సమంత రెండో వివాహం చేసుకున్న తర్వాతే పూనం ఈ పోస్ట్ పెట్టడంతో అందరూ సమంతను ఉద్దేశించి పెట్టింది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అలా ఈ కామెంట్ల నుంచి అభిమానులు ఇంకా బయటపడక ముందే సమంత పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ కూడా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక విషయాన్ని పంచుకుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే.. నిన్న సమంత పెళ్లి తర్వాత ఆమె పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ సమంత ను ఇన్స్టా లో అన్ ఫాలో చేయడమే కాకుండా "బాధితురాలిగా విలన్ చాలా బాగా నటించింది" అంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకుంది. ప్రస్తుతం ఇది వైరల్ అవ్వడంతో.. సమంతను సద్నా విలన్ అనేసిందా? అంటూ అభిమానులతో పాటు నెటిజన్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నిన్న పూనమ్ అహంకారి అంటూ పోస్ట్ పెట్టగా.. ఈరోజు సద్నా ఏకంగా విలన్ అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఇద్దరూ కూడా ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ లు పెట్టారో తెలియదు కానీ ఈ పోస్ట్ లను మాత్రం నెటిజన్స్ సమంతాకు ఆపాదిస్తున్నారు.
సమంత కెరీర్ విషయానికి వస్తే.. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇదే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ఏడడుగులు వేసిన ఈమె పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది.. అప్పటినుంచి ఒంటరిగా ఉన్న సమంత ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో ఏడడుగులు వేసింది. రాజ్ కు ఇదివరకే శ్యామలీ అనే ఆమెతో వివాహం జరిగి, పిల్లలు కూడా ఉన్నారు. భార్యకు విడాకులు ఇచ్చిన రాజ్ ఇప్పుడు సమంతను వివాహం చేసుకోవడం జరిగింది.
